ఆస్కార్‌లో ఇర్ఫాన్, రిషి, సుశాంత్, భానుకు ఘన నివాళి.. లోకాన్ని వీడిన ప్రముఖులకు శ్రద్దాంజలి

93వ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో భారతీయ దివంగత నటులకు గొప్ప గౌరవం దక్కింది. గతేడాది మరణించిన సినీ ప్రముఖులకు నివాళులర్పించే కార్యక్రమంలో భాగంగా నటులు ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, ఆస్కార్ విజేత భాను అతయాకు తదితర నటులకు ఘన నివాళి అర్పించారు.

ఇన్ మెమొరియమ్‌లో ఇర్ఫాన్ ఖాన్

ఇన్ మెమొరియమ్‌లో ఇర్ఫాన్ ఖాన్

ఆస్కార్ వేడుకలో భాగంగా ప్రదర్శించిన ఇన్ మెమొరియమ్‌లో ఇర్ఫాన్ ఖాన్‌ గురించి ప్రస్తావించారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఈ లోకాన్ని వీడిన ఇర్ఫాన్ ఖాన్ పలు అంతర్జాతీయ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. లైఫ్ ఇన్ ఏ మెట్రో, స్లమ్ డాగ్ మిలియనీర్, ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్, లైఫ్ ఆఫ్ పై, జురాసిక్ వరల్డ్ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించారు.

ఆస్కార్ విజేత భాను అతయాకు

ఆస్కార్ విజేత భాను అతయాకు

ఇన్ మెమొరీయమ్ ఈవెంట్‌లో ఆస్కార్ అవార్డు గ్రహీత, క్యాస్టూమ్ డిజైనర్ భాను అతయాకు కూడా నివాళులర్పించారు. గాంధీ చిత్రానికి క్యాస్టూమ్ డిజైనర్‌గా పనిచేసిన అతయా బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతూ ముంబైలోని ప్రముఖ హాస్పిటల్‌లో 2020 అక్టోబర్ 15వ తేదీన మరణించారు. భాను అతయా సినీ పరిశ్రమకు చేసిన సేవలను ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో కొనియాడారు.

రిషి కపూర్, సుశాంత్ సింగ్‌కు

రిషి కపూర్, సుశాంత్ సింగ్‌కు

ఇక గతేడాది మరణించిన ప్రముఖ నటుడు రిషీ కపూర్, యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు కూడా ఆస్కార్ వేదిక ఘనంగా నివాళులర్పించింది. రిషి కపూర్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మరణించగా.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని తన ఫ్లాట్‌లో ఉరివేసుకొని మరణించడం వివాదంగా మారింది. సినీ పరిశ్రమకు విశేష సేవలందించిన ఇద్దరి ప్రముఖులకు ఆస్కార్‌లో అరుదైన గౌరవం దక్కింది.

Recommended Video

Soorarai Pottru Joins OSCARS : Proud Moment For South Cinema
2020లో మరణించిన హాలీవుడ్ ప్రముఖులకు

2020లో మరణించిన హాలీవుడ్ ప్రముఖులకు

అలాగే ఇటీవల మరణించిన హాలీవుడ్ ప్రముఖులు చాద్విక్ బోస్‌మెన్, జార్జ్ లుకాస్, ల్యారీ కింగ్, హెలెన్ మెక్‌క్రోనీ తదితరుల గురించి ఇన్ మెమొరీయమ్ వీడియోలో ప్రస్తావించారు. ఈ వీడియో ప్లే అవుతున్న సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో స్టీవ్ వాండర్ పాట‌ను వినిపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X