Oscar 2023: నాటు నాటు పాటను అవమానించిన ఇంగ్లీష్ యాంకర్.. ఏం జరిగిందంటే..

భారతీయ సినిమాలు ఎంతో కాలంగా ప్రపంచవ్యాప్తంగా హడావుడి చేస్తున్నప్పటికీ ఆస్కార్ లో మాత్రం అవకాశాలు రాలేదు. కేవలం ఇంగ్లీష్ సినిమాలకు వర్క్ చేసిన ఇండియన్ టెక్నీషియన్స్ మాత్రమే ఆస్కార్ ను దక్కించుకుంటూ వచ్చారు. ఇక ఇప్పుడు మొదటిసారి రాజమౌళి కారణంగా ఇండియన్ సినిమా గర్వపడేలా RRR ఆస్కార్ వేదికపై నిలిచింది. అయితే ఆస్కార్ వేదికపై హోస్ట్ వివరణ ఇచ్చిన దానిపై నెటిజన్లు అవమానంగా ఫీల్ అవుతున్నారు. హోస్ట్ అనేవారు వివరాలు తెలుసుకోరా? అంటూ మండిపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

గర్వించేలా..

గర్వించేలా..

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆస్కార్ అవార్డు ఎట్టకేలకు ఇండియన్ సినిమాను వరించింది. రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అందుకుంది. ఇక సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్ లో నిలిచి గట్టి పోటీని ఇచ్చింది. ఇక ఆస్కార్ గెలవడం ఇండియాకు ముఖ్యంగా తెలుగు వారికి గొప్ప గర్వకారణం అని అంటున్నారు.

టీమ్ వర్క్

టీమ్ వర్క్

ఎమ్ఎమ్.కీరవాణి స్వరకల్పనలో చంద్రబోస్ రచించిన ఆ పాటను రాహుల్ సిప్లిగంజ్ కాలభైరవ పాడిన విధానం కూడా హైలెట్ గా నిలిచింది. ముఖ్యంగా రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా పవర్ఫుల్ పాటకు తగ్గట్టుగా డాన్స్ చేశారు. ఇక అందరికంటే ఎక్కువగా ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కంపోజ్ చేసిన ఆ స్టెప్పులు ఆస్కార్ వరకు తీసుకువచ్చాయి అని చెప్పవచ్చు.

టాలీవుడ్ స్థాయి పెరిగేలా

టాలీవుడ్ స్థాయి పెరిగేలా

అయితే మొదటి నుంచి కూడా RRR టీమ్ ఎక్కడికి వెళ్లినా ఇండియా సినిమా అంటూ అందులోను తెలుగు సినిమా అని ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ప్రత్యేకంగా రాజమౌళి తనను తాను పరిచయం చేసుకుంటున్నప్పుడు ఇంగ్లీష్ మీడియాకు కూడా తను ఇండియా నుంచి వచ్చిన ఒక తెలుగు దర్శకుడుని అని ప్రత్యేకించి వివరణ కూడా ఇస్తున్నాడు. ముఖ్యంగా టాలీవుడ్ స్థాయి పెరిగేలా RRR యూనిట్ గట్టి ప్రయత్నాలు అయితే చేసింది.

ఆస్కార్ వేదికపై

ఆస్కార్ వేదికపై

ఇక ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవంలో వేదికపై ప్రత్యేకంగా నాటు నాటు పాటకు సంబంధించిన డ్యాన్స్ కూడా చేశారు. స్పెషల్ డాన్సర్ గ్రూప్స్ అదిరిపోయేలా అందరికీ ఒక మంచి కిక్ అయితే ఇచ్చారు. అయితే అదే తరుణంలో తెలుగువారు అందరూ కూడా కాస్త ఫీలయ్యే విధంగా ఆస్కార్ అవార్డు హోస్ట్ మాట్లాడిన విధానం ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇది అవమానమే..

ఇది అవమానమే..

ఆస్కార్ అవార్డు హోస్ట్ అయినటువంటి జిమ్మీ కిమ్మెల్ RRR సినిమా ఒక బాలీవుడ్ సినిమా అంటూ ఆయన మాట్లాడిన విధానం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. పదేపదే తెలుగు సినిమా అని రాజమౌళి యూనిట్ బాగానే ప్రమోట్ చేసింది. అయినప్పటికీ ఇప్పుడు అంతటి భారీ వేడుకలో ఆస్కార్ పోస్ట్ జిమ్మీ ఆ విధంగా బాలీవుడ్ నుంచి వచ్చిన RRR సినిమా పాటకు ఇప్పుడు డాన్స్ చేయబోతున్నారు అని వివరణ ఇవ్వడం అవమానమే అని మరికొందరు ఫీలవుతున్నారు.

ఆ విధంగా మాట్లాడడం..

ఆ విధంగా మాట్లాడడం..

గతంలోనే బాహుబలి భారీ స్థాయిలో విజయం అందుకున్నప్పుడు విదేశీయులు ఆ సినిమాను బాలీవుడ్ అని సంబోధించారు. ఒక విధంగా ఇండియా అంటే విదేశీయులకు బాలీవుడ్ అనే పేరు ఎక్కువగా గుర్తుకు వస్తుంది. ఒకప్పుడు మన సినిమాలకు గుర్తింపు వచ్చిన కూడా బాలీవుడ్ పేరే వినిపించేది. కానీ ఇప్పుడు మాత్రం RRR సినిమాతో టాలీవుడ్ స్థాయి పెరిగింది. ఇక ఆస్కార్ వేదికపై హోస్ట్ ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని తెలుగు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X