Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆస్కార్ ఓ గేట్ పాస్ మాత్రమే!
ఎ. ఆర్. రెహ మాన్ అంటే ఇప్పుడు సంగీతం ఒక్కటే కాదు. రెహమాన్ అంటే భారత జీవన గీతం. గాత్రం. రెహమాన్ అంటే నడిచే రెండు ఆస్కార్ ప్రతిమలు. రెహమాన్ అంటే ప్రపంచ వేదికపై సగర్వంగా వినిపించిన మనదైన స్వరం. మన సంగీత సర్వస్వం. ఈ ఉపమానాలన్నీ బిరుదులు అనిపించినా రెహమాన్ మాత్రం బాద్యతగా భావిస్తారు. ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం అలవర్చుకున్నారు. వేసిన ప్రతి అడుగు మైలురాయిగా మలచుకున్నారు. ఆస్కార్ అంటే పురస్కారం ఒక్కటే కాదు. సంగీతంలో మన ముద్ర ఇదీ" అని ప్రపంచానికి సగర్వంగా చెప్పడానికి మనకు దొరికిన ఆస్కారం అంటారాయన. 'జయహొ" సంగీత కార్యక్రమ వివరాలు తెలిపేందుకు హైదరాబాద్ వచ్చారు.
ఆస్కార్ పురస్కారం వచ్చినప్పటికీ ఆయన సంగీతంలో మర్పులు ఏవీ లేవంటున్నారు. అయితే ఆస్కార్ నాకో గేట్ పాస్ లా పనిచేస్తోంది. ప్రపంచ సినిమాతో పరిచయాలు ఏర్పడుతున్నాయి. ప్రపంచంలోని ఏ స్టూడియో మెట్లు యినా ఎక్కే దైర్యం ఇచ్చింది. జీవితమే ఓ పాఠశాల. రోజుకో కొత్త పాఠం నేర్పుతుంది. బుద్దిగా నేర్చుకోవాలంతే అని యువ గాయకులకు సూచన ఇచ్చారు.
ఎ.ఆర్ రెహమాన్ కు కె.విశ్వనాధ్ అంటే ఎంతో గౌరవం అన్నారు. విశ్వనాధ్ సినిమాలన్నీ చూశాను. వాటి నుంచి చాలా స్పూర్తి పొందే వాణ్ణి. ఎప్పటికైనా ఆయనతో పనియేయాలనుకొనే వాణ్ని. ఆరేళ్ల క్రితమే ఆ అవకాశం దక్కింది. కానీ కుదర్లేదన్నారు. రాజ్ - కోటిల దగ్గర దాదాపు ఆరేళ్లు పనిచేశా. కీరవాణి చిత్రానికి పనిచేశాను. ఆ క్షణాల్ని ఎంత గానో ఆస్వాదించాను. వత్తికి సంబందించిన చాలా విషయాలు తెలియచేశారు.