ఆస్కార్ రిజల్ట్ లీక్?

ఈ జాబితా ప్రకారం రీడర్ చిత్రానికి కేట్ విన్ స్లెట్..ఉత్తమ నటి అవార్డును, ది రెజ్లర్ చిత్రానికి..మికీ రూర్క్..ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నారు. ఉత్తమ సహాయ నటుడుగా హీత్ లెడ్జెర్(ది డార్క్ నైట్), ఉత్తమ సహాయనటిగా ఎమీ ఆడమ్స్(డౌట్)ఎంపికయ్యారు. స్లమ్ డాగ్ మిలియనీర్ ఉత్తమ చిత్రంగా, దాని దర్శకుడు డానీ బోయిల్ ఉత్తమ దర్శకుడుగా అవార్డులు అందుకోనున్నారు.
అయితే ఈ జాబితా 'పూర్తిగా నకిలీ' అని అకాడెమీ ప్రతినిధి లెస్లీ అంగర్ కొట్టిపారేస్తూ ప్రకటన చేసారు. ఆస్కార్ వోట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోందని ఆయన స్పష్టంచేశారు. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో కవర్లను తెరిచే వరకూ విజేతల జాబితాలోని పేర్లు తెలియవన్నారు. ఇక ప్రైస్ వాటర్ హౌస్ కూపర్ ప్రతినిధులిద్దరూ ప్రస్తుతం బ్యాలెట్ లను లెక్కపెడుతున్నారని, అకాడెమీ అధ్యక్షుడికి కూడా విజేతలెవరన్నది ముందుగా చెప్పరని, అందువల్ల ఎటువంటి జాబీతాలు పబ్లిష్ కాలేదని ఆయన ఖండిచారు.


Click it and Unblock the Notifications











