నా ఫస్ట్ ఆస్కార్ రామ్ గోపాల్ వర్మ.. కీరవాణి మాటలకు RGV ఊహించని రియాక్షన్
పెద్దగా సినిమాలు చేసిన అనుభవం లేకపోయినా శివ అనే సినిమాతో ట్రెండ్ సెట్టింగ్ డైరెక్టర్ గా నిలిచాడు రామ్ గోపాల్ వర్మ. ఆ తరువాత సైతం రామ్ గోపాల్ వర్మ నుంచి అనేక సూపర్ హిట్ సినిమాలు ట్రెండ్ సెట్టింగ్స్ సినిమాలు వచ్చాయి. వర్మ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వివాదాస్పద అంశాలపై వివాదాస్పద ట్వీట్లకు మాత్రమే ఆయన పరిమితమవుతున్నారు. ఇక అలాంటి వర్మ గురించి కీరవాణి అయితే ఏకంగా RGV తన ఫస్ట్ ఆస్కార్ అన్నట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..
ఆయన వల్ల స్టార్లు అయిన హీరోలు కానీ ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేసి ఇప్పుడు బయటకు వచ్చి డైరెక్టర్లుగా మారిన వారు గానీ ఆయనని ఇప్పటికి అదే తరహాలో లైక్ చేస్తుంటారు. ఇక ఈ మధ్యనే ఆస్కార్ అవార్డు అందుకున్న కీరవాణి కూడా తన జీవితంలో ఇది రెండవ ఆస్కార్ అవార్డు అని మొదటి ఆస్కార్ అవార్డు రాంగోపాల్ వర్మ రూపంలో తనకు దొరికిందని చెప్పుకొచ్చారు.

తాజా ఇంటర్వ్యూలో కీరవాణి మాట్లాడుతూ నాటు నాటు సాంగ్ కు తాను తీసుకున్న ఆస్కార్ అవార్డు తన జీవితంలో రెండో ఆస్కార్ అవార్డు అని మొదటి ఆస్కార్ అవార్డు రామ్ గోపాల్ వర్మ రూపంలో తనకు దొరికిందని చెప్పుకొచ్చారు. కెరీర్ మొదట్లో దాదాపుగా 51 మంది దర్శక నిర్మాతలు నా డెమో క్యాసెట్లు పక్కన పడేశారు. కానీ ఎలాంటి పరిచయం లేకపోయినా నా వర్క్ చూసి నాకు సినిమా అవకాశం ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ.
అలా క్షణక్షణం సినిమాతో నేను మ్యూజిక్ డైరెక్టర్ గా మారాను నేను టాలెంటెడ్ కంపోజర్ అవునా కాదా అనే విషయం పక్కనపెడితే రామ్ గోపాల్ వర్మ నాతో సైన్ చేశాడు. అప్పటికే ఆయన శివ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కాబట్టి వర్మ సెలెక్ట్ చేసుకున్నాడు అనే ఆలోచనతోనే చాలా మంది నన్ను తమ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవడానికి ముందుకు వచ్చారు. ఇదంతా కేవలం రామ్ గోపాల్ వర్మ అనే ఒక ఆస్కార్ అవార్డు ద్వారానే నాకు సాధ్యమైందని చెప్పుకొచ్చారు.
అందుకే ఆయన నా జీవితంలో మొట్టమొదటి ఆస్కార్ అవార్డు అని కీరవాణి కామెంట్ చేశారు. ఇక ఈ ఇంటర్వ్యూ ని షేర్ చేసిన వర్మ తనకు చనిపోయిన ఫీలింగ్ వస్తుందని ఎందుకంటే చనిపోయిన తర్వాతే తనని ఇలా పొగుడుతారని తాను అనుకున్నానని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











