twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆస్కార్ కాంగ్రెస్ ప్రతిభే?

    By Staff
    |

    Slumdog Millionaire
    ఏ ఆర్ రహమాన్ కి ఆస్కార్ అవార్డు రావడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తన విజయంగా పేర్కొంటోంది. ఈ సందర్భంగా 'ఎచీవింగ్ ఇండియా' అనే నినాదాన్ని వాడుకలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తోంది. ఈ సందర్భంగా భారత-అమెరికా అణు ఒప్పందం, చంద్రయాన్, సుమారు 9 శాతం వృద్ధి రేటు, ఆస్కార్ అవార్డులు పూర్తిగా కైవసం చేసుకోవడం వంటివి తాము సాధించిన మైలురాళ్ళుగా పార్టీ పేర్కొంటూ ప్రకటనలు చేస్తోంది.

    'మన చలనచిత్ర పరిశ్రమ అద్భుత సంప్రదాయాలకు వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మనందరికీ వారు స్ఫూర్తిదాతలు' అని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి వ్యాఖ్యానించారు. ఆమె పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ మనుసింఘ్వి అయితే మరికొన్ని అడుగులు ముందుకు వేసి 'స్లమ్ డాగ్ మిలియనీర్'ను 'భారత్ కోసం, భారత్ తీసిన భారత చిత్రం' అని అభివర్ణించారు. 'విజయాన్ని సాధించే భారతావనికి దోహదం చేసే సత్పరిపాలనకు ప్రాధాన్యం ఇస్తూ సానుకూల వాతావరణం' నెలకొన్నదని ఆయన చెప్పారు.

    దాంతో 'స్లమ్ డాగ్' చిత్రానికి ఎనిమిది ఆస్కార్లు లభించడం ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) 'విజయాలలో' భాగంగా పరిగణిస్తున్నది. ఈ 'భారతీయ విజయం' తన ఘనతే అని అంటూ..ఇదంతా కాంగ్రెస్ యుపిఎ ప్రభుత్వంతోనే ఈ శుభ సమయం ఆసన్నమైందని ఓ ప్రకటనలో పేర్కొన్నది.మొత్తానికి ఆస్కార్ ఘనత కాంగ్రేస్ ప్రభుత్వానిదే అన్న విషయాన్ని జనాల్లో మనస్సులో కి చొప్పించి ఓట్లు సంపాదించే ప్రయత్నాల్లో ఉందని సమాచారం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X