twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆస్కార్ 2013: పోటీపడుతున్న చిత్రాలు ఏమేంటి?(ఫోటో ఫీచర్)

    By Srikanya
    |

    లాస్ఏంజిల్స్ : ప్రపంచ సినీ ప్రేమికులంతా ఎదురుచూసే ... 85వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం లాస్‌ఏంజిల్స్‌లో వైభవంగా ప్రారంభమైంది. ఈ నేపధ్యంలో ఈ పోటీలో పాల్గొన్న చిత్రాలు ఏమిటి..వాటి సంగతేంటి అనే విశేషాలు తెలుసుకోవాలని అందరికీ ఆసక్తే. ఈ నేపధ్యంలో ధట్స్ తెలుగు ఈ ఆస్కార్ పండుగలో పాల్గొన్న ముఖ్యమైన సినిమాల విశేషాలను వివరించే ప్రయత్నం చేస్తోంది.

    ఆస్కార్‌ వేడుకలో మొత్తం 24 విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి పురస్కారాల్ని ప్రదానం చేస్తుంటారు. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి విభాగాల తరవాత ఆ స్థాయిలో ఉత్తమ చిత్రం విభాగం మీదే అందరి ఆసక్తి ఉంటుంది. ఈ ఏడాది ఆ విభాగంలో మొత్తం తొమ్మిది చిత్రాలు పోటీపడుతున్నాయి. వాటిలో ఆస్కార్‌ ఉత్తమ చిత్రంగా నిలిచే సినిమా ఏది? ఎలాంటి కథల్ని ఈసారి ఆస్కార్‌కి నామినేట్‌ చేశారు? ఎవరు రూపొందించారు? తదితర విషయాల్ని తెలుసుకుందాం.

    ఉత్తమ చిత్రం విభాగం అనేది నిర్మాతల విభాగం. ఏ సినిమాకైతే ఉత్తమ చిత్రంగా పురస్కారం లభిస్తుందో ఆ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలే ఆస్కార్‌ ప్రతిమను ముద్దాడతారు. హాలీవుడ్‌ సినిమాలకు భారీ బడ్జెట్‌ అవసరం ఉంటుంది కాబట్టి ఒక్కోసారి ఒక్కో చిత్రానికి ఇద్దరు.. ముగ్గురు... నలుగురు నిర్మాతలు కూడా ఉండొచ్చు. ఈసారి బరిలో ఉన్న సినిమాల వివరాల్లోకి వెళితే...

    అమోర్‌


    మైఖేల్‌ హన్‌కే దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. మార్గరెట్‌ మెనెగోజ్‌, స్టీఫ్యాన్‌ అర్న్‌డ్ట్‌, వీట్‌ హీడ్‌స్చుక, మైఖేల్‌ కట్జ్‌ నిర్మించారు. 'అమోర్‌' కథ విషయానికొస్తే... పదవీ విరమణ పొందిన ఓ సంగీత శిక్షకురాలు, ఆమె భర్త చుట్టూ తిరుగుతుంది. వారి జీవితంలోని అంతిమ క్షణాల్ని తెర మీద ఆవిష్కరించారు. ఆ దంపతుల మధ్య భావోద్వేగాల్ని పండించడంలో దర్శకుడు సఫలీకృతుడయ్యాడు. అందుకే ఈ సినిమా ఆస్కార్‌ బరిలో నిలిచింది.

    అర్గో

    కెనడా రాయబార కార్యాలయంలో ఆరుగురు అమెరికా పౌరులకు వీసా నిరాకరిస్తారు. 1979లో జరిగిన ఓ సమస్య వల్ల అలా చేయాల్సి వస్తుంది. దీనికి ప్రతిగా యూఎస్‌ ప్రభుత్వంలోని టోనీ మెండెజ్‌ అనే ఏజెంట్‌ హాలీవుడ్‌ సాయం తీసుకొని ఓ నిర్మాతను, మేకప్‌ ఆర్టిస్టును అక్కడకు పంపుతాడు. వారిద్దరూ నకిలీ చిత్రనిర్మాణ సంస్థ ద్వారానే టోనీ తరఫున పనిచేస్తారు. తరవాత కథ ఎలాంటి మలుపులు తిరిగిందన్నది 'అర్గో' చిత్రంలో చూపించారు. బెన్‌ అఫ్లెక్‌ దర్శకత్వం వహించారు. గ్రాంట్‌ హెస్లోవ్‌, బెన్‌ అఫ్లెక్‌, జార్జ్‌ క్లూనీ నిర్మాతలు

    బీస్ట్స్‌ ఆఫ్‌ ద సదరన్‌ వైల్డ్‌

    బెన్‌ జీట్లిన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. డ్యాన్‌ జాన్‌వే, జోష్‌ పెన్‌, మైఖేల్‌ గొట్వాల్డ్‌ నిర్మాతలు. బాత్‌టబ్‌ అనే దీవిలో హుష్‌పప్పి అనే చిన్నారి తన తండ్రితో కలిసి జీవిస్తుంటుంది. ఆధునిక సమాజానికి ఆమడ దూరంలో ఉండే వీరికి వరద భయం ఉంటుంది. ఇదిలా ఉంటే ఆ పాపకు వూహా లోకంలో విహరించే శక్తి ఉంటుంది. దానివల్ల హుష్‌కి ఏం తెలిసింది? అన్నది కీలకం.

    డిజాంగో అన్‌చైన్డ్‌

    జర్మనీకి చెందిన డాక్టర్‌ కింగ్‌ షుల్జ్‌ తన అవసరాల కోసం డిజాంగో అనే బానిసను కొనుక్కుంటాడు. ఓ సందర్భంలో కింగ్‌కు డిజాంగో గొప్ప సాయం చేస్తాడు. దానికి మెచ్చి అతన్ని ఏదైనా కోరుకోమంటే... తనను కొన్నేళ్ల కిందట అమ్మిన తన భార్యను వెతుక్కోవాలని ఉందని చెబుతాడు. ఆ ప్రయాణంలో ఎన్ని అవరోధాలు ఎదుర్కొన్నాడనే కథతో 'డిజాంగో అన్‌చైన్డ్‌' చిత్రం తెరకెక్కింది. క్వెంటిన్‌ టొరంటినో దర్శకత్వం వహించారు. స్టేసే షేర్‌, రెజినాల్డ్‌ హడ్లిన్‌, పిలార్‌ సావోన్‌ నిర్మాతలు.

    లెస్‌ మిజరబుల్స్‌

    టామ్‌ హూపర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'లెస్‌ మిజరబుల్స్‌'. టిమ్‌ బెవాన్‌, ఎరిక్‌ ఫెల్నర్‌, డెబ్రా హేవార్డ్‌, కామెరూన్‌ మాకింతోష్‌ నిర్మాతలు. 19వ శతాబ్దంలో ఫ్రాన్స్‌లో జీన్‌ వాల్జీన్‌ అనే వ్యక్తికి దొంతగనం కేసులో జైలు శిక్ష పడుతుంది. కొన్నేళ్ల తరవాత బయటకొచ్చి తన కూతురు కొసెట్టెతో కలిసి కొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంటాడు. అయితే అతనికి ఇన్‌స్పెక్టర్‌ జావెర్ట్‌ రూపంలో కష్టాలు ఎదురవుతాయి. ప్రతి విషయంలో అడ్డుతగిలి అతన్ని భయాందోళనకు గురి చేస్తుంటాడు.

    లైఫ్‌ ఆఫ్‌ పై

    పై పటేల్‌ అనే పదహారేళ్ల కుర్రాడు తల్లితండ్రులు, కొన్ని జంతువులతో కలిసి పెద్ద పడవలో పసిఫిక్‌ మహా సముద్రంలో ప్రయాణిస్తుంటాడు. పెను తుపాను ధాటికి వారందరికీ దూరమై చిన్న పడవలోకి మారతాడు. అందులో ఓ పులి కూడా ఉంటుంది. దాన్నుంచి తనను కాపాడుకొంటూ మిగిలిన ప్రయాణం ఎలా సాగించాడనే కథతో 'లైఫ్‌ ఆఫ్‌ పై' రూపొందింది. ఆంగ్‌లీ దర్శకత్వంలో రూపొందింది. ఆయన గిల్‌ నెట్టెర్‌, డేవిడ్‌ వొమార్క్‌లతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించా

     లింకన్‌


    స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'లింకన్‌'. యూఎస్‌లో బానిసత్వాన్ని రూపుమాపేందుకు రాజ్యాంగంలో పదమూడో చట్ట సవరణ చేసేందుకు లింకన్‌ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడనే కథాంశంతో తెరకెక్కింది. స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌, కాథలీన్‌ కెన్నడీ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ ఏడాది ఉత్తమ దర్శకుడి విభాగంలో నామినేషన్‌ దక్కించుకోవడంతో కలిపి స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌కి ఇది పదిహేనో ఆస్కార్‌ నామినేషన్‌.

    సిల్వర్‌ లైనింగ్స్‌ ప్లేబుక్‌

    ప్యాట్‌ సొలాటనోకి బైపోలార్‌ డిజార్డర్‌ సమస్య ఉంటుంది. అతని తల్లితండ్రులు ఎనిమిది నెలలపాటు చికిత్స చేయిస్తారు. మానసిక చికిత్సాలయం నుంచి బయటకొచ్చిన తరవాత ప్యాట్‌ ఎలాంటి జీవితం కొనసాగించాడు? అతనికి మరో మహిళతో ఏర్పడ్డ బంధం ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? మధ్యలో అతను మందులు వేసుకోవడం ఎందుకు మానుకున్నాడు? దాని పర్యవసానాలు ఏమిటి? అనే కోణంలో సాగే కథ 'సిల్వర్‌ లైనింగ్స్‌ ప్లేబుక్‌'. డేవిడ్‌ ఓ.రస్సెల్‌ దర్శకత్వం వహించారు. డోన్నా గిగ్లియోట్టి, బ్రూస్‌ కోహెన్‌, జోనాథన్‌ గోర్డన్‌ నిర్మాతలు

    జీరో డార్క్‌ థర్టీ

    కాథరీన్‌ బిగెలో దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'జీరో డార్క్‌ థర్టీ'. మార్క్‌ బోయల్‌, కాథరీన్‌ బిగెలో, మేగన్‌ ఎల్లిసన్‌ నిర్మాతలు. 9/11 అమెరికా దాడుల తరవాత అల్‌ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ని పట్టుకొనేందుకు మాయ అనే సీఐఏ ఏజెంట్‌ని అమెరికా ప్రభుత్వం ప్రత్యేకంగా నియమిస్తుంది. పదేళ్లపాటు ఆమె సాగించే పరిశోధన ఇతివృత్తంగా 'జీరో డార్క్‌ థర్టీ' సినిమా తెరకెక్కింది.

     ఇప్పటికి ప్రకటించిన ఈ సంవత్సరం అస్కార్ అవార్డుల విజేతల వివరాలు:

    ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: లైఫ్ ఆఫ్ పై
    ఉత్తమ యానిమేషన్ చిత్రం: బ్రేవ్
    ఉత్తమ సినిమాటోగ్రఫీ : క్లాడియో మిరాండ (లైఫ్ ఆఫ్ పై)
    ఉత్తమ యానిమేషన్ లఘు చిత్రం: పేపర్ మ్యాన్
    ఉత్తమ సహాయ నటుడు : క్రిస్టోఫో వాజ్
    ఉత్తమ షార్ట్ ఫిల్మ్: కర్ఫ్యూ
    ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం: సెర్బింగ్ ఫర్ షుగర్ మేన్
    ఉత్తమ విదేశీ భాషా చిత్రం: అమోర్

    English summary
    
 Steven Spielberg's "Lincoln," which stars Daniel Day-Lewis and Sally Field, leads with 12 nominations. The movie is up for Best Picture, as are "Beasts of the Southern Wild," "Silver Linings Playbook," "Zero Dark Thirty," "Life of Pi," "Les Miserables," "Amour," "Django Unchained" and "Argo." Seth MacFarlane, creator of "Family Guy," director of the film "Ted" and a current Oscar nominee, is hosting the ceremony, which airs at 5 p.m. PT / 8 p.m. ET, after OTRC.com's LIVE STREAM Red Carpet show and the "On The Red Carpet at the Oscars" TV special.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X