Oscar Awards Live: ఆస్కార్ స్టేజ్‌పై నాటు నాటు.. ఆఖరులో అరుదైన దృశ్యం.. తెలుగోడు రొమ్ము విరిచేలా!

సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా భావించే అవార్డే 'ఆస్కార్'. అంతర్జాతీయ స్థాయిలోనే ఉత్తమంగా చెప్పుకునే ఈ పురస్కారాన్ని అందుకోవాలని ప్రతి ఒక్క సినీ ప్రముఖుడూ కలలు కంటూ ఉంటారు. అకాడమీ అవార్డు అని కూడా పిలిచే దీనికోసం సినీ పరిశ్రమల్లో అందరూ తపన పడుతుంటారు. మరి 2022వ సంవత్సరానికి గానూ అందించబోతున్న 95వ ఆస్కార్ అవార్డుల వేడుక ప్రస్తుతం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇందులో RRR మూవీలోని నాటు నాటు పాట లైవ్ పెర్ఫార్మెన్స్ జరగగా.. దానికి భారీ రెస్పాన్స్ దక్కింది. ఆ వివరాలు మీకోసమే!

ఎంతో గ్రాండ్‌గా ఆస్కార్ పండగ

2022వ సంవత్సరానికి సంబంధించిన అందించే 95వ ఆస్కార్ అవార్డులు ప్రధానోత్సవ కార్యక్రమం లాస్ ఎంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగింది. అంగరంగ వైభవంగా మొదలైన ఈ వేడుకలో తారల సందడి చేశారు. దీనికోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దేశాలకు చెందిన సినీ ప్రముఖులు విచ్చేశారు. దీంతో ఈ వేడుక మొత్తం ఉల్లాసంగా ఉత్సాహంగా సాగిపోతోంది.

ఆస్కార్‌ బరిలో నిలిచిన నాటు

RRR (రౌద్రం రణం రుధిరం) మూవీలో 'నాటు నాటు' పాట ప్రపంచం మొత్తాన్ని ఊపేసిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే ఈ సాంగ్ ఎన్నో అవార్డులను కూడా గెలుచుకుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఆస్కార్ అవార్డుకు కూడా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయింది. తద్వారా తెలుగు నుంచి నామినేట్ అయిన మొట్టమొదటి సాంగ్‌గా ఇది రికార్డుకెక్కింది.

RRR యూనిట్... స్పెషల్‌గానే

చరిత్రను తిరగరాడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్‌లో నిలిచిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీలోని 'నాటు నాటు' పాట ఆస్కార్‌కు నామినేట్ అవడంతో చిత్ర యూనిట్ సభ్యులు లాస్ ఎంజిల్స్‌లో సందడి చేస్తోన్నారు. ఇందులో రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రేమ్ రక్షిత్, రాహుల్ సిప్లీగంజ్, కాల భైరవ, కార్తికేయలు ఉన్నారు.

వాళ్లిద్దరి లైవ్ పెర్ఫార్మెన్స్‌తో

ఎంతో వేడుకగా జరుగుతోన్న 95వ ఆస్కార్ అవార్డులు ప్రధానోత్సవ కార్యక్రమంలో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన రాహుల్ సిప్లీగంజ్, కాల భైరవ కలిసి RRR (రౌద్రం రణం రుధిరం) మూవీలోని 'నాటు నాటు' పాటకు లైవ్ పెర్ఫార్మెన్స్ చేశారు. దీనికి హాలీవుడ్‌లోని డ్యాన్సర్లు కూడా అదిరిపోయే స్టెప్పులతో అలరించారు. దీంతో వేదిక మొత్తం నాటు నాటు అంటూ ఊగిపోయింది.

అచ్చు గుద్దినట్లుగా చేశారు

రాహుల్ సిప్లీగంజ్, కాల భైరవ RRR (రౌద్రం రణం రుధిరం) మూవీలోని 'నాటు నాటు' పాటకు లైవ్ పెర్ఫార్మెన్స్ చేస్తోన్న సమయంలో యూఎస్‌కు చెందిన డ్యాన్సర్లు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎలాంటి స్టెప్పులైతే వేశారో.. అచ్చు గుద్దినట్లు వాటినే చేశారు. అంతేకాదు, దాదాపు పది మంది వరకూ ఆ సిగ్నేచర్ స్టెప్‌ వేశారు. అలాగే, అమ్మాయిలు కూడా అదరగొట్టేశారు.

ఆఖరులో అరుదైన దృశ్యం


95వ ఆస్కార్ అవార్డులు ప్రధానోత్సవ వేదికపై RRR (రౌద్రం రణం రుధిరం) మూవీలోని 'నాటు నాటు' పాట లైవ్ పెర్ఫార్మెన్స్ జరుగుతున్నంత సేపూ హాలీవుడ్ సెలెబ్రిటీలు ఊగిపోతూ కనిపించారు. ముఖ్యంగా పాట పూర్తైన తర్వాత అక్కడున్న ప్రతి ఒక్కరూ నిలబడి మరీ చప్పట్లు కొట్టి అభినందించారు. మొత్తంగా ఈ దృశ్యం తెలుగోడు రొమ్ము విరిచేలా అనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X