twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆస్కారే అంతిమం కాదు: అమితాబ్‌

    By Staff
    |

    Amitabh Bachchan
    నటీనటుల ప్రతిభకు ఆస్కార్ అవార్డులే అత్యున్నత గుర్తింపుగా భావించాల్సిన అవసరం లేదని బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యానించారు. అలాగని వాటిని అగౌరవపరచడం లేదని,వాటికున్న స్ధానం వాటిదేనన్నారు. శుక్రవారం ఆయన జైపూర్‌లో జరుగుతున్న సాహిత్యోత్సవాల్లో 'బచ్చానాలియా' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.ఆయన పేరిట రాసిన పుస్తకం అది. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలో మంచి చిత్రాలకు కొరతే లేదని అన్నారు. వారు మనకు ఆస్కార్‌ ఇవ్వదలచుకుంటే ఇవ్వొచ్చని చెప్పా రు. ఇవ్వకుంటే ఇంకా మంచిదని అన్నారు.

    ఆస్కార్‌ అవార్డు ఇవ్వదలచుకుంటే 'గాంధీ' సినిమా కాస్ట్యూమ్‌ డిజైనర్‌ భానూ అథయాకు మొదట ఇవ్వాలని చెప్పారు. స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ను తాను విమర్శించినట్టు తన బ్లాగ్‌లో వచ్చిన వ్యాఖ్యలు తనవి కావని వివరణ ఇచ్చారు. ఆ చిత్రం 10 ఆస్కార్‌ నామినేషన్లు పొందడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. భారతదేశానికి చెందిన సౌండ్‌ ఇంజనీర్‌ రసూల్‌ ఆస్కార్‌ అవార్డుకు నామినేట్‌ కావడం తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు. ఎ.ఆర్‌. రెహ్మాన్‌ భారత్‌కు మరో ఆస్కార్‌ తీసుకువస్తాడనే విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెర వెనక కష్టపడుతున్న సాంక్తిక నిపుణల శ్రమకు కూడా ఎట్టకేలకు గౌరవం లభించటం సంతోషమన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X