అతని శాడిజం తట్టుకోలేక ఓ వేశ్య తిరగపడింది...
ప్రజలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించే ఓ గ్రామాధికారి ప్రతిరోజూ ఓ వేశ్యతో గడుపుతుంటాడు. కాలక్రమంలో ఆమె తనకంటూ ఓ ఆనందమయ జీవితాన్ని ఆశించి ఓ పోస్ట్‌మ్యాన్‌ని ప్రేమిస్తుంది. అది సహించని గ్రామాధికారి ఆ పోస్ట్ మ్యాన్ ని చంపిస్తాడు. దాంతో ఉగ్రరూపం దాల్చిన వేశ్య ఆ గ్రామాధికారిని ఎలా హతం చేస్తుందనేది క్లైమాక్స్ అంటున్నారు 'ఒసేయ్..మల్లమ్మ' చిత్ర నిర్మాతలు. ఉత్తరప్రదేశ్‌లోని రంగ్‌పూర్ గ్రామానికి చెందిన ఓ వేశ్య వాస్తవ జీవితగాథ ఆధారంగా ప్రఖ్యాత దర్శకురాలు కల్పనా లజ్మి రూపొందించిన 'చింగారి' చిత్రం తెలుగులో 'ఒసేయ్.. మల్లమ్మ' పేరుతో అనువాదమైన సంగతి తెలిసిందే. టైటిల్ పాత్రను మాజీ మిస్ యూనివర్స్ సుస్మితాసేన్ పోషించిన ఈ చిత్రం ఈ నెల 11న రాష్ట్రవ్యాప్తంగా విడుదలవుతోంది.
ఇక ఈ చిత్రం లోని హైలెట్స్ వివరిస్తూ...గ్రామాధికారిపై వేశ్య తిరగబడే సన్నివేశాలు ఉత్కంఠభరితంగా ఉంటాయి.ప్రతి రాత్రీ గ్రామాధికారి శాడిజంతో వేశ్య పడే వేదన ప్రేక్షకుల్ని కదిలిస్తుంది అంటున్నారు. పిరమిడ్ ఫిలిమ్ ఫ్యాక్టరీ పతాకంపై జె. పాండురంగారెడ్డి ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం తొలికాపీతో విడుదలకు సిద్ధమైంది. వేశ్య పాత్రని సుస్మితాసేన్ పోషించగా, గ్రామాధికారి పాత్రలో మిథున్ చక్రవర్తి గొప్పగా నటించారు. వేశ్య ప్రియుని పాత్రని అనూజ్ సాహ్ని చేశారు. ఇలా అరుణ్, గణేశ్ ఆచార్య ఇతర ప్రధాన తారాగణమైన ఈ చిత్రానికి మాటలు: శ్రీనివాసమూర్తి, కథ: భూపేన్ హజారికా, సంగీతం: శ్రీవాత్సవ.


Click it and Unblock the Notifications











