twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కల్యాణ్‌కు 'ఓయూ' హెచ్చరిక: 'కత్తి' జోలికొస్తే?..

    |

    Recommended Video

    పవన్ కు 'ఓయూ' వార్నింగ్ ! 'కత్తి' జోలికొస్తే ?

    పవన్ కల్యాణ్ ఫ్యాన్స్-మహేష్ కత్తి మధ్య వివాదం ఎంత దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. దాదాపు నాలుగు నెలల నుంచి ఇరువురి మధ్య ఎడతెగని వివాదం రగులుతూనే ఉంది. హీరోయిన్ పూనంకౌర్ ఎంట్రీతో వివాదం మరో మలుపు తిరిగింది.

    తెగేదాకా వచ్చింది: 'కత్తి'కి కోన వెంకట్ డెడ్ లైన్?, ఆరోజు ఏం చేస్తారు?; సీన్ లోకి వేణుమాధవ్..తెగేదాకా వచ్చింది: 'కత్తి'కి కోన వెంకట్ డెడ్ లైన్?, ఆరోజు ఏం చేస్తారు?; సీన్ లోకి వేణుమాధవ్..

    ఇదిలా ఉంటే, సినీ ఇండస్ట్రీ నుంచి రచయిత కోన వెంకట్ సహా పలువురు పవన్ కు అండగా నిలబడ్డ సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేష్ కత్తికి కూడా ఓయూ జేఏసీ నుంచి మద్దతు లభించడం గమనార్హం.

     మహేష్ కత్తికి మద్దతుగా:

    మహేష్ కత్తికి మద్దతుగా:

    మహేష్ కత్తికి మద్దతుగా ఓయూ జేఏసీ నాయకులు శుక్రవారం ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో సంఘీభావ సమావేశం నిర్వహించారు. మహేష్ కత్తి హాజరైన ఈ సమావేశంలో పలువురు విద్యార్థి సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కత్తికి ఉస్మానియా జాయింట్ యాక్షన్ కమిటీ పూర్తి మద్దతు ప్రకటించింది.

     పవన్ కల్యాణ్‌కు హెచ్చరిక..:

    పవన్ కల్యాణ్‌కు హెచ్చరిక..:

    సమావేశంలో పవన్ కల్యాణ్‌పై ఓయూ జేఏసీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పవన్ కల్యాణ్ అభిమానులు కత్తి మహేష్‌పై దాడి చేస్తే చూస్తూ ఊరుకోం. కత్తి మహేష్‌పై దాడి గనుక జరిగితే పవన్‌ను తెలంగాణలో తిరగనివ్వబోం.. పవన్ సినిమాలను తెలంగాణలో అడనివ్వబోం.' అని హెచ్చరించారు.

     'పవన్ కల్యాణ్ హఠావో..'

    'పవన్ కల్యాణ్ హఠావో..'

    సమావేశంలో 'పవన్ కల్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో' అంటూ జేఏసీ నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉస్మానియా విద్యార్థులకు తోడు బహుజన సంఘాలు కూడా మహేష్ కత్తికి మద్దతుగా కదలాలనే ఆలోచన చేస్తుండటం గమనార్హం.

     పవన్‌పై కత్తి ఆరోపణలు:

    పవన్‌పై కత్తి ఆరోపణలు:

    సమావేశంలో మహేష్ కత్తి మాట్లాడుతూ పవన్ అభిమానుల తీరును తప్పు పట్టారు.పవన్ కల్యాణ్ తన అభిమానులను వేరే పార్టీలకు అమ్ముకుంటున్నాడని ఆయన ఆరోపించారు. అభిమానులను తనపైకి ఉసిగొల్పుతున్నారని, ఇప్పటికైనా వాళ్లను అదుపులో పెట్టుకోవాలని సూచించారు.

     దగ్గరపడుతున్న డెడ్ లైన్:

    దగ్గరపడుతున్న డెడ్ లైన్:

    మరోవైపు రచయిత కోన వెంకట్ చెప్పిన 'జనవరి 15' డెడ్ లైన్ దగ్గరపడుతోంది. అప్పటిదాకా సంయమనం పాటించాలని చెప్పిన కోన వెంకట్.. ఆరోజు ఎలాంటి చర్యలకు దిగబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది. కత్తిపై పవన్ నేరుగా స్పందిస్తారా?.. లేక మరెవరితోనైనా మధ్యవర్తిత్వం నడుపుతారా? అన్నది చూడాలి.

    English summary
    Osmania University students supported film critic Mahesh Kathi and they warned Pawan Kalyan. On Friday at arts college they arranged a meeting to support mahesh kathi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X