twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెన్సార్ బోర్డు ఆఫీసుపై ఓయూ జేఏసీ దాడి: సినిమాపై నిషేధమే కారణం!

    ‘శరణం గచ్చామీ’ సినిమా మీద సెన్సార్ బోర్డ్ నిషేదం విధించడాన్ని వ్యతిరేకిస్తూ.... హైదరాబాద్ లో కేంద్ర సెన్సార్‌ బోర్డు కార్యాలయంలపై విద్యార్థి సంఘాల నేతలు మంగళవారం దాడి చేసారు.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్‌: 'శరణం గచ్చామీ' సినిమా మీద సెన్సార్ బోర్డ్ నిషేదం విధించడాన్ని వ్యతిరేకిస్తూ.... హైదరాబాద్ లో కేంద్ర సెన్సార్‌ బోర్డు కార్యాలయంలపై విద్యార్థి సంఘాల నేతలు మంగళవారం దాడి చేసారు. ఓయూ జేఏసీ, టీఎస్‌ జేఏసీ, ఎస్టీ తెలంగాణ విద్యార్థి సంఘం నేతృత్వంలో ఆందోళనకారులు ఈ దాడికి పాల్పడ్డారు.

    ఈ ఘటనలో కార్యాలయంలోని ఫర్నిచర్‌, అద్దాలను ధ్వంసం చేసి కాగితాలను, ఫైళ్లను చించేసారు. 'శరణం గచ్ఛామీ' సినిమా విడుదలకు అనుమతి ఇవ్వాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించారు. సమాచారం అందుకున్న గాంధీనగర్‌ పోలీసులు అక్కడకి చేరుకుని ఆందోళనకారులను అరెస్టు చేసి కేసే నమోదు చేసారు.

     సెన్సార్ బోర్డు నిషేదించడానికి కారణం

    సెన్సార్ బోర్డు నిషేదించడానికి కారణం

    శాంతి భద్రతల సమస్య వస్తుందనే కారణం సెన్సార్‌ బోర్డ్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడానికి నిరాకరించింది. ప్రేమ్‌రాజ్‌ దర్శకత్వంలో బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై బొమ్మకు మురళి ఈ చిత్రాన్ని నిర్మించారు.

     జయప్రకాశ్‌రెడ్డితో పాటు రచయిత దేశపతి శ్రీనివాస్‌

    జయప్రకాశ్‌రెడ్డితో పాటు రచయిత దేశపతి శ్రీనివాస్‌

    నవీన్ సంజయ్‌, తనిష్క్‌ తివారి జంటగా నటించిన ఇందులో పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణమురళి, జయప్రకాశ్‌రెడ్డితో పాటు రచయిత దేశపతి శ్రీనివాస్‌, బీసీ సంఘం నాయకులు ఆర్‌. కృష్ణయ్య వంటివాళ్లూ కీలక పాత్రలు చేసారు.

     నిర్మాత మురళి మాట్లాడుతూ

    నిర్మాత మురళి మాట్లాడుతూ

    ‘‘డాక్టరేట్‌ పొందిన నేను, ఎంతో పరిశోధనచేసి తయారుచేసిన సబ్జెక్టుతో ఈ సినిమా నిర్మించాను. గత డిసెంబర్‌లో సెన్సార్‌కు పంపితే, జనవరి 2న సెన్సార్‌ సభ్యులు చిత్రాన్ని చూశారు. ఈ సినిమా విడుదలైతే సమాజంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుందనీ, అల్లర్లు చెలరేగుతాయనీ, అందువల్ల సర్టిఫికెట్‌ను నిరాకరిస్తున్నామనీ తెలియజేస్తూ సెన్సార్‌ ఆఫీసర్‌ పంపిన ఉత్తరం అందడంతో షాకయ్యామని తెలిపారు. ఏ నిబంధనల కింద సర్టిఫికెట్‌ నిరాకరిస్తున్నారో సెన్సార్‌వాళ్లు చెప్పలేదు. కావాలంటే రివిజన్ కమిటీకి వెళ్లమని సలహా ఇస్తున్నారు. ఇలా అయితే కొత్త నిర్మాతలు ఎలా వస్తారు? ఈ విషయంలో న్యాయం కోసం సుప్రీంకోర్టుకైనా వెళ్లేందుకు సిద్ధం అన్నారు.

     కథేంటి?

    కథేంటి?

    ‘‘ఇది ఓ జర్నలిస్ట్‌ కథ. రాజ్యాంగంలో పొందుపరచిన రిజర్వేషన్ల అంశంపై పీహెచ్‌డీ చేయాలనుకున్న అతనికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేదే ఈ చిత్ర కథాంశం.

    English summary
    The Osmania University students have attacked the censor board office in Hyderabad today. According to the reports, 'Sharanam Gachami' movie was not allowed to release their film and the censor board officials have put the film’s release on hold.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X