వర్మకు ఓయూ జేఏసీ విద్యార్థుల షాక్.. ఆఫీస్‌లోకి దూసుకెళ్లి రచ్చ రచ్చ

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కార్యాలయంపై కొందరు గుర్తు తెలియని కొందరు వ్యక్తుల దాడి చేయడం సినీ పరిశ్రమలో కలకలం రేపింది. అయితే ఈ దాడి వెనుక ఎవరి హస్తం ఎవరిదనే విషయంపై మాట్లాడటానికి వర్మ నిరాకరించారు. పోలీసులకు ఫిర్యాదు చేశాం, వారి దర్యాప్తులో వెల్లడైన విషయాల ఆధారంగానే దాడి ఎవరు చేశారనే విషయంపై మాట్లాడుతానని వర్మ చెప్పినట్టు తెలుస్తున్నది. ఈ దాడి ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..

పవర్ స్టార్ మూవీతో వివాదం

పవర్ స్టార్ మూవీతో వివాదం

ప్రముఖ దర్శకుడు వర్మ తాజాగా రూపొందిస్తున్న చిత్రం పవర్ స్టార్. పవన్ కల్యాణ్ జీవితంలో కొన్ని విషయాల ఆధారంగా సినిమా తీస్తున్నట్టు అనిపిస్తున్నప్పటికీ.. తన జీవితం కాదని వర్మ స్పష్టం చేశారు. ఓ రాజకీయ నాయకుడి జీవితంలో కొన్ని అంశాలనే చెబుతున్నాడు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పోలిన వ్యక్తికి ప్రవన్ కల్యాణ్‌తో పవర్ స్టార్ సినిమా తీస్తున్నామని వర్మ స్పష్టం చేశారు

ఎవడినైనా రమ్మను..

ఎవడినైనా రమ్మను..

దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా టెలివిజన్ ఇంటర్యూలో మాట్లాడుతూ.. నోరుంది కాదా అనే వార్నింగ్‌లు ఎవడైనా ఇస్తాడు. వార్నింగ్‌లు ఇచ్చేవాళ్లకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. ఎవరైనా నా వార్నింగ్ ఇవ్వదలచుకొంటే నేరుగా నా ఆఫీస్‌కు రావొచ్చు.. నా ఆఫీస్ అడ్రస్ గూగుల్‌లో కూడా ఉంది. ఎవరైనా రావొచ్చు. ఎవడినైనా రమ్మని చెప్పు అని సవాల్ విసిరారు అంటూ వర్మ కామెంట్లు చేశారు.

వర్మ ఆఫీస్‌లో ఓయూ స్టూడెంట్స్

వర్మ ఆఫీస్‌లో ఓయూ స్టూడెంట్స్

వర్మ కామెంట్ల నేపథ్యంలో కొందరు యువకులు గురువారం మధ్నాహ్నం బంజారాహిల్స్‌లోని ఆయన ఆఫీస్‌కు చేరుకొన్నారు. వారి రాక గురించి పోలీసులకు వర్మ కార్యాలయం ఫిర్యాదు చేయడంతో వారు అక్కడికి చేరుకొన్నారు. అయితే ‘వర్మతో మాట్లాడేందుకు వచ్చాం. గొడవ పడేందుకు రాలేదు. మేము వచ్చామంటే కూర్చొమన్నారు విద్యార్తులు తెలిపారు.

Recommended Video

Parannageevi First Song | ఈ పాట RGV గనక వింటే అంతే సంగతి
వర్మ ఆఫీస్‌లో గందరగోళం

వర్మ ఆఫీస్‌లో గందరగోళం

వర్మతో మాట్లాడి వెళ్తామని ఓయూ జేఏసీకి చెందిన విద్యార్తులుగా చెప్పుకొంటున్న కొందరు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దాంతో కొంత గందరగోళం నెలకొన్నది. వర్మ ఆఫీస్‌లోకి వెళ్లిన కొందరు ఓయూ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. నాగరాజు, కిరణ్, సంపత్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని జూబ్లిహిల్స్‌లోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X