twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘అత్తారింటికి దారేది’ కి ఓయూ జెఎసి హెచ్చరిక

    By Srikanya
    |

    హైదరాబాద్ : తెలుగు సినీ అభిమానుల అందరి దృష్టీ అత్తారింటికి దారేది చిత్రం విడుదల మీదే ఉంది. తాజాగా తెలంగాణ ఏర్పాటు కాకుండా తరచూ అడ్డుపడుతున్న కేంద్రమంత్రి చిరంజీవి వైఖరికి నిరసనగా ఆయన సోదరుడు పవన్‌కళ్యాణ్ నటించిన చిత్రం 'అత్తారింటికి దారేది..'ని అడ్డుకుంటామని ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ హెచ్చరించింది. డిస్ట్రిబ్యూటర్లు,ఎగ్జిబిటర్లు సినిమాను కొనొద్దని హెచ్చరించారు.

    మంగళవారం ఓయూలో జరిగిన జేఏసీ ముఖ్యనేతల సమావేశం అనంతరం ఓయూ జేఏసీ చైర్మన్ కరాటే రాజు, తెలంగాణ గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షుడు నెహ్రూనాయక్, ఓయూ అధ్యక్షుడు రవిలు మీడియాతో మాట్లాడారు. మొదట సామాజిక న్యాయం అని ప్రగల్బాలు పలికి న చిరంజీవి.. మాటమార్చి 1500మంది తెలంగాణ విద్యార్థుల మరణానికి కారణమయ్యారని ఆరోపించారు. అందుకే తెలంగాణ ప్రాం తంలో పవన్‌కళ్యాణ్ సినిమాను ప్రదర్శించొద్దని థియేటర్ల యజమానులకు విజ్ఞప్తి చేశారు. డిస్ట్రిబ్యూటర్లు,ఎగ్జిబిటర్లు సినిమాను కొనొద్దని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో జగదీష్, జగన్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

    పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'అత్తారింటికి దారేది' చిత్రం సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి ఈ చిత్రం క్లీన్ 'U' సర్టిఫికెట్ పొందింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్‌తో కలిసి సంయుక్తంగా నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈచిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా వినోదాత్మకంగా తెరకెక్కించారు. కామెడీ, యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉంటాయి.

    ఈచిత్రంలో నదియా పవన్ కళ్యాణ్ పాత్రలో, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

    English summary
    OU JAC warns Attarintiki Daaredi film. 'We will not allow the screening of Pawan Kalyan’s Attarintiki Daaredi film in the Telangana region', said members of the OU JAC.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X