twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జున ఇంటి వద్ద ఉద్రిక్తత.. పోరాడి తెచ్చు కున్న తెలంగాణలో ఏంటీ పరిస్థితి?

    |

    తెలుగులో 'బిగ్ బాస్' రియాలిటీ షో ఎంత పాపులర్ అయిందో.. అంతే స్థాయిలో వివాదాస్పదం కూడా అయింది. గతంలో పలు వివాదాలు చుట్టుముట్టినప్పటికీ ఈ షో రెండు సీజన్లను పూర్తి చేసుకోగలిగింది. అయితే, ప్రస్తుతం ఈ షోపై వ్యతిరేకత భారీగా వ్యక్తమవుతోంది. దీంతో 'బిగ్ బాస్' సీజన్ - 3 ప్రారంభం అవుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలాఉండగా, అక్కినేని నాగార్జున ఇప్పటికే మొదటి ఎపిసోడ్ పూర్తి చేశారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అంతేకాదు, కంటెస్టెంట్లు ఇప్పటికే హౌసులోకి ప్రవేశించారని కూడా వార్తలు వస్తున్నాయి. ఎన్నో వివాదాల నడుమ ఈ షో ఆదివారం సాయంత్రం ప్రారంభం కాబోతుంది.

    ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్శిటీలోని విద్యార్థులు 'బిగ్ బాస్'పై పోరాటానికి సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగానే వారంతా ర్యాలీగా వచ్చి అక్కినేని నాగార్జున ఇంటిని ముట్టడించారు. దీంతో జూబ్లీహిల్స్‌లోని నాగార్జున ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, నాలుగు రోజులుగా అక్కడే భద్రతా ఏర్పాట్లు చేస్తున్న పోలీసులు.. నిరసన తెలపడానికి వచ్చిన విద్యార్థులను అదుపులోనికి తీసుకుంటున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట కూడా జరిగినట్లు తెలుస్తోంది. వాస్తవానికి విద్యార్థి సంఘం నాగ్ ఇంటిని, అన్నపూర్ణ స్టూడియోస్ ముట్టడిస్తామని ముందుగానే ప్రకటించింది. దీనిలో భాగంగానే వారంతా నాగ్ ఇంటికి చేరుకున్నారు.

    బిగ్‌బాస్ 3 వివాదంపై ఇద్దరు మహిళలు ఒంటరి పోరాటం చేస్తుంటే, నాగార్జున కనీసం స్పందించలేదని ఓయూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మహిళలను కించపరిచే షోకి నాగార్జున ఏ రకంగా హోస్ట్‌గా ఉంటారని ప్రశ్నిస్తున్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో మహిళలను కించపరిచే, వేధించే బిగ్‌బాస్ లాంటి షోలను వ్యతిరేకిస్తున్నట్టు ఓయూ విద్యార్థులు ప్రకటించారు.

     Ou Students Darna at Akkineni Nagarjuna House

    'ఫిదా' ఫేమ్ గాయత్రి గుప్తా ఎంటరవడంతో ఈ వ్యవహారం మరింత సంచలనం అయింది. ''నన్ను సీజన్ -2 కోసం సెలెక్ట్ చేశారు. అయితే, నాతో షో నిర్వహకుల్లో ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ షోలోకి వస్తున్నావు కదా.. మరి 100 రోజులు సెక్స్ లేకుండా ఉండగలవా.? నీ సెక్స్ లైఫ్‌ను ఎలా మేనేజ్ చేసుకుంటావు..? అంటూ ప్రశ్నించారు'' అంటూ ఆమె చెప్పడం సంచలనం అయింది. దీనికితోడు, ప్రముఖ దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి కూడా ఈ షోపై పోరాటానికి దిగడంతో ఇది హైలైట్ అయింది. అలాగే, ఈ వ్యవహారం ఢిల్లీకి చేరడంతో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.

    వాస్తవానికి పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను పరిశీలించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న బిగ్ బాస్ నిర్వాహకులను అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. కౌంటర్ దాఖలు చేయడానికి రెండు వారాలు గడువు ఇస్తూ కేసును వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. దీంతో ఈ షో జూలై 21 నుంచి ప్రారంభం కాబోతుంది.

    English summary
    Tollywood Senior Hero Akkineni Nagarjuna Host Bigg Boss Telugu season 3. This Show Starts In Few Days. In This Time Telugu Sensational Actor, Fidaa Fame Gayathri Gupta, Anchor Swetha Reddy Share Few Statements opposite Bigg Boss Telugu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X