81 ఏళ్ల చరిత్రలో నెం.1 హిట్: బండ్ల గణేష్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో శివబాబు బండ్ల సమర్పణలో పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై అగ్ర నిర్మాత బండ్ల గణేష్ నిర్మించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 'గబ్బర్ సింగ్' జూన్ 29తో సూపర్ షేర్స్‌తో 50 రోజులు పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ..'81 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా ప్రేక్షకుల అపూర్వ ఆదరణ అందుకుంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 306 కేంద్రాల్లో అద్భుతమైన షేర్స్ తో 50 రోజులు పూర్తి చేసుకుని 100 రోజులకు పరుగులు తియ్యడం ఎంతో ఆనందంగా ఉంది. నిర్మాతగా నాకు ఈ సంచలన విజయం పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది. ఇంతటి బిగ్గెస్ట్ హిట్ తీసే అవకాశం ఇచ్చిన మా హీరో పవన్ కళ్యాణ్ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే 'గబ్బర్ సింగ్' విజయానికి కారకులైన మా దర్శకుడు హరీష్ శంకర్‌కి, టోటల్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ యూనిట్ మెంబర్స్‌కి పేరు పేరునా ధన్యవాదాలు. ముఖ్యంగా 'గబ్బర్ సింగ్' విజయానికి కారకులైన ప్రేక్షకలోకానికి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి స్పెషల్ థాంక్స్' అన్నారు.
దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ..'ఫెయిల్యూర్‌తో స్టార్ట్ అయిన నాకు సక్సెస్ విలువ తెలుసు. 'గబ్బర్ సింగ్' లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసే అవకాశం ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి, నిర్మాత బండ్ల గణేష్‌కి, గబ్బర్ సింగ్ విజయం కోసం అహర్నిశలూ కృషి చేసిన మా టీం మెంబర్స్ ప్రతి ఒక్కరికి థాంక్స్ చెబుతున్నాను. దర్శకుడిగా ఈ విజయం నాకు పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది' అన్నారు.
హీరోయిన్ శృతి హాసన్ మాట్లాడుతూ..'పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్‌తో కలిసి చేసిన 'గబ్బర్ సింగ్' చిత్రం పెద్ద హిట్ కావడం హ్యాపీగా ఉంది. నా కెరీర్లోనే ఇది ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్. ఈ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, నిర్మాత బండ్ల గణేష్ లకు థాంక్స్' అన్నారు.


Click it and Unblock the Notifications











