మా హీరో ఈసారి హిట్ కోడతాడంటున్న హిట్ డైరెక్టర్!
'నేల టిక్కెట్టు' గాళ్లతో పెట్టుకుంటే నేల నాకించేస్తారు... అంటూ మాస్ డైలాగ్ చెప్పిన రవితేజ నేల టికెట్ టీజర్ తో ఆకట్టుకున్నాడు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై తెరకేక్కబోతోంది. ఈ సినిమాలో రవితేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, సుబ్బరాజు, ఆలి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, ప్రియదర్శి, సురేఖా వాణి, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.
ఫిదా సినిమాకు సంగీతం అందించిన శక్తికాంత్ కార్తీక్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. రవితేజ మార్క్ ఎంటర్ టైన్మెంట్‌తో వస్తోన్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించబోతోందని చిత్ర యూనిట్ చెబుతోంది. రవితేజ ఈసారి తప్పకుండా హిట్ కొడతాడని చెబుతున్నారు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ.

సోగ్గాడే చిన్ని నాయన', 'రారండోయ్ వేడుక చూద్దాం' వంటి హిట్ చిత్రాలు ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు. ఈ రెండు సినిమాలు మంచి విజయాలు సాధించడంతో నేల టికెట్ సినిమపై మంచి అంచనాలు ఉన్నాయి. మేలో సినిమాను విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











