రికార్డులపై మంచు మనోజ్ ఘాటు కామెంట్
'మాకు రికార్డులు బ్రద్దలు కొట్టాలనే ఇంటెన్షన్ లేదు. డిఫెరెంట్ ఫిల్మ్ లు చేయాలని ఉంది. నాకు రికార్డులు బ్రద్దలు కొట్టాలనే ఆలోచన ఉన్నట్లైతే నేను పెద్ద డైరక్టర్స్ తో నా సినిమాలు ప్లాన్ చేసుకుంటాను. డైరక్టర్ లేనిదే హీరో లేడనే సత్యం ఈగ విజయం నిరూపించింది' అని ట్వీట్ చేసారు మంచు మనోజ్. నందమూరి బాలకృష్ణ, మంచు మనోజ్ నటించిన 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా' ఆగస్టు 2న కాకుండా వారం రోజులు ముందుగానే అంటే ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంచు మనోజ్ ట్వీట్ చేసారు.
"నాలుగేళ్ల మా టీమ్ కల నిజమవుతోంది. మా టీమ్ ని ఎంకరేజ్ చేయండి అని ట్వీట్ చేసారు. అలాగే మా సినిమా కు విపరీతమైన క్రేజ్ రావటంతో డిస్ట్రిబ్యూటర్స్ ప్రింట్స్ పెంచమని అడుగుతున్నారు" అన్నారు. ఇది ప్రింట్స్ పెంచటం అనేది పూర్తిగా డిస్ట్రిబ్యూటర్స్ ఛాయిస్ అని చెప్పారు.
'ఊ కొడతారా ఉలిక్కిపడతారా' చిత్రానికి మంచు లక్ష్మీప్రసన్న ఈ చిత్రానికి నిర్మాత. శేఖర్‌రాజా దర్శకుడు. దీక్షాసేథ్ నాయిక. డా.ఎం.మోహన్‌బాబు సమర్పిస్తున్నారు. మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందింది. ఈ చిత్రం గురించి నిర్మాత లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ " విజయవంతమైన చిత్రానికి కావాల్సిన అన్ని హంగులతో మా చిత్రం సర్వసన్నద్ధమైంది. మా అన్నయ్య బాలకృష్ణగారి పాత్రకి హై ఓల్టేజ్ స్పందన వస్తుందనడంలో అనుమానం లేదు. మహిళా ప్రేక్షకులకు, యువతకు విపరీతంగా నచ్చుతుంది" అన్నారు.
అలాగే మనోజ్ మంచి పెర్‌ఫార్మర్‌గా ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాతో సక్సెస్‌ఫుల్ ప్రామిసింగ్ స్టార్‌గా ఎదుగుతాడు. "ఇందులో కీలక పాత్రలో నేను నటించాను'' అని అన్నారు. డా. మోహన్‌బాబు మాట్లాడుతూ "లక్ష్మీ ప్రసన్న తొలి చిత్రంగా 'ఝుమ్మంది నాదం' చేసి విజయవంతమైన నిర్మాతగా రుజువు చేసుకుంది. ఈ చిత్రాన్ని కూడా ఎక్కడా రాజీ పడకుండా నిర్మించింది. కొండొకచో నా ధైర్యానికి కూడా పరీక్ష పెట్టే విధంగా తన తొలి చిత్రానికి పదింతలు ఖర్చు పెట్టి తెరకెక్కించింది. మనోజ్ పాత్రకు మంచి ప్రశంసలు వస్తాయి. బాలయ్య సినిమా హైలైట్ అవుతారు' అన్నారు. బాలకృష్ణ, ప్రభు, మనోజ్, దీక్షాసేథ్, లక్ష్మీ ప్రసన్న, సోనూసూద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈచిత్రానికి సంగీతం బెబో శశి.


Click it and Unblock the Notifications











