twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలంగాణ లొల్లి : ఎవరినీ కించపరచలేదన్న పూరి జగన్నాథ్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం ఎవరి మనోభావాలు కించపరచడానికి తీయలేదని, ఒక వేళ అలా జరిగి ఉంటే వెంటనే ఆ సన్నివేశాలను, డైలాగులను వెంటనే తొలగిస్తాతమని చిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్ మీడియా ముఖంగా ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం థియేటర్ల వద్ద తెలంగాణ వాదులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పూరి పై విధంగా స్పందించారు.

    పూరి వెంటనే ఉన్న దిల్ రాజు మాట్లాడుతూ....ఇక్కడి ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవడం నైజాం డిస్ట్రిబ్యూటర్‌గా నా బాధ్యత. అందుకే వివాదానికి కారణమైన సన్నివేశాలను, సీన్లను తొలగించేందుకు దర్శకుడిని ఒప్పించానని తెలిపారు.

    వివాదానికి కారణం ఇదే..

    రాష్ట్రాన్ని పీడించే పెద్ద సమస్య ఓ పార్టీ నాయకుడు తెలుగుతల్లి పార్టీని స్థాపించడంగా చూపించారు. సినిమాలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రెడ్డి జనరంజకంగా పాలిస్తున్న తరుణంలో దింపి తన కుమారుడు రానాబాబును ముఖ్యమంత్రిని చేయాలని ప్రతిపక్ష నేత జవహర్ నాయుడు ప్రయత్నిస్తుంటాడు. ఇందులో చంద్రశేఖర రెడ్డిని వైయస్ రాజశేఖర రెడ్డికి, జవహర్ నాయుడిని చంద్రబాబుకుఅన్వయించుకుంటున్నారు. రాష్ట్ర రాజకీయాలకు వచ్చేసరికి ఇదే వరుస అనిపిస్తూ ఉంటుంది.

    కానీ, తెలుగుతల్లి పార్టీని తెలంగాణ రాష్ట్ర సాధనకు ఏర్పడిన రాజకీయ పార్టీగా, జవహర్ నాయుడిని ఆ పార్టీ నేతగా తీసుకోవడానికి వీలుగా సినిమాలో సంభాషణలను, ఇతివృత్తాన్ని ప్రదర్సించారు. రానాబాబు (ప్రకాష్ రాజ్) తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావుకు అన్వయిస్తూ కథను నడిపించాడు. రానాబాబు తన రాీజకీయ ప్రస్థానం కోసం తెలుగుతల్లి ఉద్యమ పార్టీని స్థాపిస్తాడు. తన రాష్ట్రంలో తెలుగు ప్రజలు తప్ప మరాఠీ, బెంగాలీ, మలయాళీలు ఎవరూ ఉండకూడదని, వారు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను బహిష్కరించాలని ప్రసంగాలు చేస్తుంటాడతను.

    తెలంగాణ ఉద్యమాన్ని నేరుగా ప్రస్తావించే సాహసం చేయలేక తెలుగు తల్లి పార్టీ, తెలుగు ఉద్యమం అంటూ సృష్టించారని అంటున్నారు. ఇందులో ప్రకాష్ రాజ్‌ను ఉద్దేశించి హీరో రాంబాబు (పవన్ కళ్యాణ్) ప్రశ్నిస్తూ ఇలా డైలాగులు చెప్పించారు - 'పక్క రాష్టాల తల్లులంటే నీ తల్లికి పడదు. అలాంటి నీకు జాతీయ గీతం పాడే హక్కు ఎక్కడి', 'నిన్ను, నీ బాబుని ఢిల్లీ గెస్ట్ హౌస్ నుంచి తీసుకొచ్చి బట్టలూడదీసి కొడితే ఎలా ఉంటుందో రాష్ట్రం అలా ఉందిరా'. ఈ డైలాగులు తెలంగాణ ఉద్యమంపై విషం చిమ్మేవేనని తెలంగాణవాదులు మండిపడుతున్నారు.

    English summary
    "Our intention is not to insult anybody" Puri clarify on Cameraman Gangatho Rambabu film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X