Don't Miss!
- Technology వన్‌ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్‌లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
- News ఆ నలుగురిపై టీడీపీ గురి - జగన్ సమర్ధతకు సవాల్..!!
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Finance 9 రోజులుగా 54 శాతం పెరిగిన స్టాక్.. బ్రోకరేజ్ తాజా టార్గెట్ ధర ఇదే.. మీరూ కొంటున్నారా..??
- Sports CSK జట్టులో కొత్త ప్లేయర్: రోహిత్-కోహ్లి వికెట్లు తీసిన ఘనుడు
- Lifestyle Gruha Pravesham Wishes in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మధుబాబు ‘షాడో’కి వెంకీ ‘షాడో’ కి...
హైదరాబాద్ :. వెంకటేష్, శ్రీకాంత్, తాప్సీ, మధురిమ కాంబినేషన్ లో మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన చిత్రం 'షాడో'. ఈ చిత్రం టైటిల్ ... మధుబాబు రాసిన డిటెక్టివ్ నవలల్లలోని షాడో కేరక్టర్ ఒకటే కావటంతో ..రెండింటికీ ఏమన్నాసారూప్యం ఉందా..'షాడో'కి ఆదర్శమా అని అడిగారు. దానికి మెహర్ రమేష్ సమాధాన మిచ్చారు.
ఆయన మాట్లాడుతూ... నేను విజయవాడలో పుట్టి, పెరిగాను. అక్కడ పెరిగినవాళ్లకెవరికైనా నవలలపై ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది. మధుబాబు రాసిన నవలలన్నీ తెగ చదివేవాడ్ని. అయితే అందులో ఉన్న షాడోకీ మా 'షాడో'కి పోలిక ఉండదు. ఈ టైటిల్‌ని ఐదేళ్ల క్రితం నమోదు చేశాను. పగ, ప్రతీకారాలకు సంబంధించిన కథ ఇది. ఆ పగకు ఓ పేరు కావాలి. ఆ పేరు 'షాడో' అయితే బాగుంటుందని పెట్టాను. సినిమా చూసినవారికి 'షాడో' తప్ప వేరే టైటిల్ బాగుండదనిపిస్తుంది అన్నారు.
అలాగే ''నేను తీసే 30 కోట్ల రూపాయల సినిమాకి 5వేల కోట్లున్న నిర్మాత నాకవసరంలేదు. ఎందుకంటే నిర్మాతకి డబ్బుకన్నా ముందు సినిమా మీద మమకారం ఉండాలి. పరుచూరి శివరామప్రసాద్ అలాంటి నిర్మాతే. సినిమా మీద ఇష్టంతో 'షాడో'ని ఖర్చుకి వెనుకాడకుండా తీశారు'' అన్నారు.
ఇక ఇప్పటివరకు వెంకటేష్‌గారి కెరీర్లో ఈ స్థాయి రిలీజ్ లేదు. అంత భారీగా విడుదలవుతోంది. కచ్చితంగా మేమందరం బాగుంటామనే నమ్మకం ఉంది. నేను వెంకటేష్‌గారికి కథ చెప్పినప్పుడుకన్నా, నేను డ్రీమ్ చేసినదానికన్నా ఈ సినిమా బాగా వచ్చింది. ఫస్ట్ కాపీ చూసిన తర్వాత నా రచయితలు గోపీమోహన్, కోన వెంకట్‌తో మాట్లాడాను. వాళ్లు కూడా విజయం ఖాయమనే నమ్మకంతో ఉన్నారు. నా నమ్మకం పది రెట్లు పెరిగింది అన్నాకుయ
సినిమా చూసాక...మెహర్ రమేష్ ఇలాంటి సినిమా తీయగలడా? అని అందరూ ఆశ్చర్యపోతారు. నా నిర్మాత నాతో పదే పదే చెప్పిన మాట ఇది. అలాగే వెంకటేష్‌గారి సతీమణి ఈ చిత్రాన్ని చూశారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంజాయ్ చేశానన్నారామె. తమన్ పాటలెంత బాగా చేశాడో రీ-రికార్డింగ్ కూడా అంతే అద్భుతంగా చేశాడు. యాక్షన్ విషయానికొస్తే.. స్టన్ శివ సమకూర్చిన ఫైట్స్ థ్రిల్‌కు గురి చేస్తాయి. గోపీమోహన్, కోన వెంకట్, మార్తాండ్ కె. వెంకటేష్.. ఇలా అందరూ మంచి అవుట్‌పుట్ ఇచ్చారు. ఒక్క సీన్ కూడా బోర్ అనిపించదు అని వివరించారు.