For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మహేష్ బాబు, మిగతా హీరోల సెంటిమెంట్స్ ఇవే..(ఫోటో ఫీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్: సినిమా పరిశ్రమలో నమ్మకాలదే రాజ్యం. ఆర్టిస్టు అయినా, దర్శకుడు అయినా వారికంటూ కొన్ని నమ్మకాలు ఉంటాయి. వాటిని తూచ తప్పకుండా పాటిస్తూంటారు. అయితే ఆ సెంటిమెంట్ మనిషి మనిషికీ మారిపోతూంటుంది. గొప్ప విషయం ఏమిటంటే.. ఇక్కడ ఒకరి సెంటిమెంట్ ని మరొకరు గౌరవిస్తారు.

  ఉదాహరణకి... ఒక హీరోకి ఒక సూపర్‌ హిట్‌ వచ్చినప్పుడు ఏ కారుని వాడితే అదే ఆయనకి సెంటిమెంటుగా మారిపోతుంది. దాన్ని వదలటానికి ఇష్టపడడు. అలాగే... ఒక హీరోయిన్‌ షూటింగ్‌ మొదటిరోజున ఏ డ్రెస్‌ వేసుకుంటే విజయం వచ్చిందో అదే డ్రెస్‌ని సెంటిమెంటుగా మార్చేసుకుంటుంది.

  నిజానికి ఇలాంటి సెంటిమెంట్స్ పాత తరంలో ఎక్కువగా ఉండేవి. అయితే చిత్రం ఏమిటంటే... ఇంత మోడ్రన్, డిజిటల్ యుగంలోనూ సెంటిమెంట్స్ దే రాజ్యం. టైటిల్ దగ్గరనుంచి సెంటిమెంట్ నే ఫాలో అయ్యి సినీ జనం... వాటిని వదులుకోవటానికి ఇష్టపడరు. కోట్లతో వ్యాపారం కాబట్టి... సెంటిమెంట్ ని నమ్మటం ఇక్కడ చాలా కామన్.

  మన హీరోలు, హీరోయిన్స్, దర్శకులు, సెంటిమెంట్స్ కొన్ని... స్లైడ్ షో లో..

  మహేష్‌ బాబుకి ఓ సెంటిమెంట్‌ ఉంది. సినిమాకి సంబంధించి ఏదైనా పనిమీద ముంబై వెళితే అతడు ఎప్పుడూ ఒకే హోటల్లో బసచేస్తాడట. మారియట్‌ హోటల్‌ మహేష్‌కి లక్కీ హోటల్‌.

  అల్లు అర్జున్‌కి కూడా వైజాగ్‌ అంటే ఓ సెంటిమెంటు ఉందట. అతడి కెరీర్‌లో సూపర్‌ హిట్టయిన 'ఆర్య', 'దేశముదురు', 'జులాయి' చిత్రాల కథలు విశాఖపట్నంతో ముడిపడి ఉంటాయి. కాబట్టి రాబోయే చిత్రాల్లో కూడా వీలైతే ఒక్క సన్నివేశమైనా విశాఖతో సంబంధం ఉండేలా చూసుకుంటున్నాడు.

  స్టార్‌ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న శ్రీనువైట్లకి కూడా ఓ సెంటిమెంటు ఉంది. ఆయన ఏ సినిమా షూటింగ్‌ మొదలుపెట్టినా తొలి షెడ్యూల్‌ విదేశాల్లో ఉండేలా చూసుకుంటాడట. విదేశంలో షూటింగ్‌ అయ్యాకనే స్వదేశంలో చిత్రీకరణ పెట్టుకుంటాడు.

  సంగీత దర్శకుడు తమన్‌కి కూడా విదేశాల్లోనే లక్‌ ఉందని నమ్మకం! ముఖ్యంగా శ్రీనువైట్ల చిత్రం కోసమైతే విదేశాల్లోనే స్వరకల్పన మొదలుపెడతాడు.

  హీరోయిన్‌ కాజల్‌కి ఫస్ట్‌ షాట్‌ నమ్మకం ఉంది. ఆమె ఏ సినిమాకైనా షూటింగ్‌ మొదటి రోజు తెల్ల డ్రెస్‌ వేసుకుని వెళ్తుంది. ఒకవేళ చిత్రీకరించాల్సిన దృశ్యంలో వేరే రంగు దుస్తులు ధరించాల్సి వచ్చినా... ముందుగా వైట్‌ డ్రెస్‌ వేసుకుని ఒక షాట్‌ తీయించేసుకుంటుంది. 'మగధీర' నుంచి ఆమెకీ సెంటిమెంటు అంటుకుందట.

  దర్శకుడు పూరి జగన్నాథ్‌ ఏ సినిమాకైనా స్క్రిప్ట్‌ ఎక్కడ రాసుకుంటారు? ఇంట్లోనూ కాదు, ఇండియాలోనూ కాదు. ఏకంగా బ్యాంకాక్‌ వెళ్లిపోతారు. అక్కడి సముద్రతీరాల్లో కూర్చుని కథ, మాటలు, స్క్రీన్‌ప్లే రాసుకుంటారు. బ్యాంకాక్‌లో కూర్చుని రాసుకున్న కథలన్నీ మంచి విజయాలు సాధించాయని ఆయన నమ్మకం.

  ప్రభుదేవాకి ఓ సెంటిమెంటు ఉంది. ఏ దర్శకుడైనా సినిమా ప్రారంభం అంటే ముహూర్తపు షాట్‌ తీస్తారు. అది కూడా ఏదో ఒక చిన్న డైలాగును హీరోహీరోయిన్లతో చెప్పిస్తారు. కానీ, ప్రభుదేవా మాత్రం ఏకంగా ఒక పాటనే ముందుగా చిత్రీకరిస్తాడు. సల్మాన్‌ ఖాన్‌తో 'వాంటెడ్‌' షూటింగ్‌ని అలా పాట చిత్రీకరణతోనే ప్రారంభించాడట. అది సూపర్‌హిట్‌ అయింది. ఆ తరువాత అదే ప్రభుకి ఓ సెంటిమెంట్ గా మారిపోయింది.

  తమిళ హీరో అజిత్‌కి ఇటీవలే ఓ కొత్త సెంటిమెంటు మొదలైంది. చాలాయేళ్ల తరువాత 'మంగాత' చిత్రంతో మరోసారి సూపర్‌ హిట్‌ కొట్టి ఫామ్‌లోకి వచ్చాడు. అయితే, ఈ చిత్రంలో తలకి డై వేసుకోకుండా నటించాడు. నెరసిన జుత్తుతోనే ఆ సినిమాలో నటించడం వల్లనే సూపర్‌హిట్‌ అయిందని ఫిక్స్‌ అయిపోయాడు. దాంతో ఇకపై నటించబోయే చిత్రాల్లోనూ డై వేసుకోనంటున్నాడు అజిత్‌.

  త్రిషాకీ ఓ సెంటిమెంట్ ఉంది! తను నటించబోయే చిత్రంలో తాగి తూలుతున్నట్టు ఒక్క సన్నివేశమైనా ఉండాలంటోంది. ఎందుకంటే, తన కెరీర్‌లో హిట్టయిన సినిమాలన్నింటిలోనూ తాగి తూలిన సీన్లు ఉన్నాయట. తాగినట్టు నటిస్తే హిట్‌ ఖాయమన్నది ఆమె నమ్మకం.

  నయనతారకి '5' సెంటిమెంటు. ఒక కొత్త సినిమాకి సంబంధించి కథ వినాలంటే ఐదో తేదీనే చెప్పమంటుందట. అడ్వాన్సు కూడా 'ఐదు అంకెల్లో'నే తీసుకుంటుందట.

  English summary
  Everyone who is part of film industry is ruled by sentiments and that is always seen in their films. And even the top range directors also have that kind of sentiment.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X