జైలు: సంజయ్ దత్ పార్టీ చేసుకున్నాడా? మళ్లీ సెలవుకోసం..

By Bojja Kumar

హైదరాబాద్: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ యరవాడ జైల్లో జైలు శిక్ష అనుభవిస్తూ ఇటీవల పెరోల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. 14 రోజుల అనంతరం ఆయన మళ్లీ తిరిగి జైలుకెళ్లాల్సి ఉంది. తన సెలవుల్లో న్యూఇయర్ కూడా వచ్చేట్లు చూసుకున్నాడు సంజయ్ దత్.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Out of Jail on Furlough, Sanjay Dutt Seeks Another Extension

ఒక ప్లాన్ ప్రకారం.....న్యూఇయర్ పార్టీలో ఎంజాయ్ చేయడానికే సంజయ్ దత్ సెలవు తీసుకున్నాడని వార్తలు వెలువడ్డాయి. మరి సంజయ్ దత్ పార్టీ చేసుకున్నాడా? లేదా? అనే సంగతి తెలియదు కానీ తన గడువు దగ్గర పడటంతో మళ్లీ సెలవు కావాలని అధికారులకు వినతి పెట్టుకున్నాడు. 14 రోజులు సెలవు కావాలని అభ్యర్థించాడు. అధికారులు ఇంకా ఆయన అభ్యర్థనపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సెలవులు ఇస్తే పొంగల్ ఫెస్టివల్ కూడా జరుపుకుని వెళతాడేమో?

ఈ సంగతి అలా ఉంచితే.....సంజయ్ దత్ కు రెండు వారాల పెరోల్ ఇవ్వడంపై మహారాష్ట్ర ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. ఆయనకు పెల్ ఇవ్వడం వెనక ఏదైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా అనే విషయాలు ఆరా తీస్తున్నారు. విచారణ జరుగుతున్న నేపథ్యంలో మళ్లీ సెలవు ఇస్తారా? లేదో అనేది చర్చనీయాంశం అయింది.

1993 బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్ పూణెలోని ఎరవాడ జైలులో గడుపుతున్న సంగతి తెలిసిందే. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే అభియోగం రుజువు కావడంతో టాడా కోర్టు సంజయ్ దత్‌కు ఆరేళ్ల కారాగార శిక్ష విధించింది. టాడా కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ శిక్షను మాత్రం ఐదేళ్లకు తగ్గించింది.

రెండు దశాబ్దాల క్రితం అతను 18 నెలల పాటు జైలులో ఉన్నాడు. దాంతో మిగిలిన 42 నెలలు సంజయ్ దత్ కారాగార శిక్ష అనుభవించాలని సుప్రీంకోర్టు మార్చి 21, 2013న తేదీన తీర్పు చెప్పింది. సంజయ్ దత్ మే 16, 2013న తేదీన ముంబై కోర్టులో లొంగిపోయారు. ఆ తర్వాత ఆయనను పూణేలోని యెరవాడ జైలుకు తరలించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X