For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోమాలు నిక్కబొడిచే భారత యుద్దఖైదీల వీరగాథ: "గ్రేట్ ఇండియన్ ఎస్కేప్" కథ ఇదే

|

మూడు నెలల కింద మణిరత్నం దర్శకత్వం లో వచ్చిన "చెలియా" గుర్తుంది కదా ఫ్లయింగ్ లెఫ్టినెంట్ దిలీప్ పారుల్కర్ జీవితంలోని వాస్త‌వ ఘ‌ట‌న‌ల‌ ఆధారంగా ఆ కథని అల్లుకున్నాడట మణి. అయితే చెలియా లో ప్రేమకథ కి రిలేట్ చేసి కథని తయారు చేసుకోవటం తో. పూర్తి స్థాయి యుద్దనేపథ్య కథగా కనిపించకపోగా... అదే పెద్ద మైనస్ గామారి పెద్ద కమర్షియల్ పరాజయాన్నిచూడాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మొత్తంగా ఆనాటి భారత వైమానిక దళ సైనికుల కథని మాత్రమే బేస్ చేసుకొని ఇప్పుడు బాలీవుడ్ లో మరో సినిమా తెరకెక్కబోతోంది.

తరణ్ జీత్ సింగ్

తరణ్ జీత్ సింగ్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. 1971 డిసెంబర్ 10న సుఖోయ్-7 యుద్ధ విమానంతో పాక్ లోని రాడార్ కేంద్రాన్ని ధ్వంసం చేసేందుకు పారుల్క‌ర్‌ దూసుకెళ్లారు. ఆ విమానాన్ని పాక్ సైన్యం పేల్చేయ‌డంతో పారాచూట్ ఆధారంతో పారుల్క‌ర్ కింద‌కు దిగి యుద్ధ ఖైదీగా పాక్ చేతికి చిక్కారు.

పారుల్క‌ర్

రావల్పిండికి సమీపంలోని ఒక జైలులో పారుల్క‌ర్ తో పాటు భారత వైమానిక దళానికి చెందిన ఎం.ఎస్‌.గ్రేవాల్‌, హరీశ్‌ సిన్హ్‌ జీలు కూడా బందీలుగా ఉన్నారు. ఇది జరిగిన ఆరు రోజులకు యుద్ధం ముగిసింది.అయినా వారిని భార‌త్ కు అప్ప‌గించ‌క‌పోవ‌డంతో ఆ ముగ్గురూ రెండు నెల‌ల‌పాటు జైలు గోడ‌ను త‌వ్వి అక్క‌డినుంచి త‌ప్పించుకున్నారు.

పాక్ పోలీసుల‌కు దొరికిపోయారు

వారు పెషావ‌ర్ చేరుకున్న త‌ర్వాత పాక్ పోలీసుల‌కు దొరికిపోయారు. ఆ త‌ర్వాత మూడునెలలు జైలు శిక్ష అనుభ‌వించారు. ఖైదీలను అప్పగించాలన్న ఒప్పందంతో 1972 డిసెంబర్‌ 1న పాక్ వారిని భారత్ కు అప్పగించింది. త‌ర్వాత‌ పారుల్కర్ మళ్లీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరారు. అయితే, చెలియా సినిమాలో మాత్రం వారు పెషావ‌ర్ లో పోలీసుల నుంచి త‌ప్పించుకొని అప్ఘానిస్థాన్ వెళ్లి అక్క‌డినుంచి భార‌త్ కు వ‌చ్చిన‌ట్లుగా చూపించారు.

ద గ్రేట్‌ ఇండియన్‌ ఎస్కేప్‌

బాలీవుడ్ లో తరణ్ జీత్ సింగ్ తెరకెక్కిస్తున్న ‘ద గ్రేట్‌ ఇండియన్‌ ఎస్కేప్‌' సినిమా చిత్రీకరణలోనే ఆసక్తి రేపుతోంది. ఈ కథ ఫ్లయింగ్ లెఫ్టినెంట్ దిలీప్ పారుల్కర్ జీవితంలో చోటుచేసుకున్న అంశాల ఆధారంగా రూపొందడం విశేషం. 1968లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో విధులు నిర్వర్తిస్తున్న వేళ కమాండింగ్ ఆఫీసర్ ఎం.ఎస్.బవాతో ఇలా అన్నాడట...

తప్పించుకొని తీరుతా

"మేం శత్రు భూభాగంలోకి చొచ్చుకెళ్లి పోరాడతాం. ఒక్క తూటాతో మా విమానం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఒకవేళ నేను యుద్ధఖైదీగా శత్రువుల చేతికి చిక్కితే, తప్పించుకొని తీరుతా" అన్నారు. ఆయన ఈ మాట చెప్పిన మూడేళ్లకు అంటే 1971లో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య యుద్ధం మొదలైంది.

యుద్ధ ఖైదీగా పాక్ చేతికి

అప్పటికి పారుల్కర్ కు 29 ఏళ్లు. 1971 డిసెంబర్ 10న సుఖోయ్-7 యుద్ధ విమానంతో పాక్ లోని రాడార్ కేంద్రాన్ని ధ్వంసం చేసేందుకు దూసుకెళ్లారు. ఇంతలో విమానాన్ని పాక్ సైన్యం పేల్చేసింది. దీంతో పారాచూట్ సాయంతో పారుల్కర్ కిందికి దిగి యుద్ధ ఖైదీగా పాక్ చేతికి చిక్కారు.

తలకు రివాల్వర్ గురి పెట్టి

ఆ సమయంలో పాక్ అధికారి ఒకరిని బందీగా చేసుకుని, అతని తలకు రివాల్వర్ గురి పెట్టి, తనను ఢిల్లీలో వదలాల్సిందిగా డిమాండ్ చేయాలని ఆయన అనుకున్నారు. కానీ ఆ ఆలోచనను ఆయన విరమించుకున్నారు. అతనిని రావల్పిండికి సమీపంలోని ఒక జైలులో బంధించారు. అక్కడే భారత వైమానిక దళానికి చెందిన ఎం.ఎస్‌.గ్రేవాల్‌, హరీశ్‌ సిన్హ్‌ జీలు కూడా బందీలుగా ఉన్నారు. ఇది జరిగిన ఆరు రోజులకు యుద్ధం ముగిసింది.

తప్పించుకునేందుకు ప్లాన్

దీంతో తమను స్వదేశానికి అప్పజెబుతారని భావించిన ఆ ముగ్గురూ మూడు నెలల పాటు మౌనంగా ఉండిపోయారు. అయితే తమ అంచనా తప్పడంతో తప్పించుకునేందుకు ప్లాన్ రచించారు. జైలులో పారిపోయేందుకు అనువుగా ఉన్న ఒక సెల్‌ లోకి ముగ్గురూ మారారు.

తవ్వడం మొదలుపెట్టారు

అప్పటి నుంచి 18 అంగుళాల మందమున్న గోడను ప్రతి రాత్రి ఒక పదునైన వస్తువుతో తవ్వడం మొదలుపెట్టారు. రెండు నెలల తరువాత వారి వ్యూహం ఫలించింది. దీంతో 1972 ఆగస్టు 13న అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో పారుల్కర్‌, ఎం.ఎస్‌.గ్రేవాల్‌, హరీశ్‌ లు జైలు నుంచి బయటపడ్డారు.

600 రూపాయలతో

పఠాన్‌ లు ధరించే సంప్రదాయ దుస్తులు ధరించి, నీరు, ఔషధాలు, ఎండు పళ్లు, 600 రూపాయలతో జైలుకు దూరంగా ఉన్న రోడ్డెక్కారు. 12 గంటలు ప్రయాణించి పెషావర్ చేరుకున్నారు. అక్కడి నుంచి ఐదారు చెక్ పోస్టులను జాగ్రత్తగా దాటుకుంటూ జామ్ రౌద్ చేరుకున్నారు.

అతిపెద్ద పొరపాటు

అయితే లాండీ కోటాల్‌ లో ఎప్పుడో మూసేసిన లాండీ ఖానా అనే రైల్వే స్టేషన్‌ కోసం అక్కడి వారిని వాకబు చేశారు. ఇదే వారు చేసిన అతిపెద్ద పొరపాటు. దీంతో వారి సమాచారం పోలీసులకు చేరడం, వారొచ్చి మళ్లీ ఆముగ్గుర్నీ పట్టుకోవడం జరిగిపోయింది.మళ్లీ మూడునెలలు అదే జైలులో నరకం చూడడం జరిగింది.

మళ్లీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరారు

యుద్ధ ఖైదీలను అప్పగించాలన్న ఒప్పందంతో 1972 డిసెంబర్‌ 1న పాక్ వారిని భారత్ కు అప్పగించింది. అనంతరం పారుల్కర్ మళ్లీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరారు. అప్పట్లో శత్రుదేశం నుంచి తప్పించుకుని పారిపోవడం మినహా మరొక ఆలోచన ఉండేది కాదని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనే ఇప్పుడు బాలీవుడ్ సినిమాగా రూపుదిద్దుకుంటోంది.

English summary
Taranjiet Singh Namdhari on his film, The Great Indian Escape, which is based on a true story of three Indian Air Force pilots who break out from a prisoner of war camp
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more