»   » వందల మంది కష్టపడుతున్నారు, బాహుబలి-2 సెట్స్ అంతా కొత్తగా...!

వందల మంది కష్టపడుతున్నారు, బాహుబలి-2 సెట్స్ అంతా కొత్తగా...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి-ది బిగినింగ్' చిత్రం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఈ సినిమాకు సీక్వెల్ 'బాహుబలి-ది కంక్లూజన్' రిలీజ్ కాబోతోంది. తొలి పార్టులో ఉన్న సెట్టింగ్సే మళ్లీ చూపకుండా బాహుబలి-2 కోసం కొత్తగా సెట్టింగ్స్ వేస్తున్నారు.

ప్రస్తుతం బాహుబలి-2 సెట్టింగ్స్ కు సంబంధించిన పనులు చాలా వేగంగా సాగుతున్నాయట. ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ఆధ్వర్యంలో దాదాపు 500 మంది రాత్రింభవళ్లు కష్టపడి భారీ సెట్స్ తీర్చి దిద్దుతున్నారు. తొలి పార్టులో చూపినవే మళ్లీ చూపిస్తే ప్రేక్షకులు బోర్ ఫీలయ్యే అవకాశం ఉన్నందున సెట్టింగ్స్ చాలా వరకు మారుస్తున్నారు.


తొలి భాగం కంటే....బాహుబలి పార్ట్-2 మరింత బిగ్గర్ గా ఉంటుందని, విజువల్స్ పరంగా, సెట్టింగ్స్ పరంగా, యుద్ధ సన్నివేశాలు, కథ పరంగా తొలి భాగాన్ని మించేలా ఉంటుందని అంటున్నారు. బాహుబలి సినిమా భారీ విజయం సాధించిన నేపథ్యంలో రెండో భాగంపై అంచనాలు భారీగా ఉంటాయని భావించిన దర్శకుడు రాజమౌళి... సినిమా అంచనాలు అందుకునే రేంజిలో తీర్చి దిద్దుతున్నారు.


బాహుబలి-2 2017లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగంలో విజువల్ ఎఫెక్ట్స్ పరంగా సినిమాలో కొన్నిలోపాలు ఉన్న నేపథ్యంలో రెండో భాగంగా అవేవీ రిపీట్ కాకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు..


సరికొత్త మాహిష్మతి సామ్రాజ్యం

సరికొత్త మాహిష్మతి సామ్రాజ్యం

బాహుబలి-2 లో మాహిష్మితి సామ్రాజ్యం సరికొత్తగా కనిపించబోతోంది.


సరికొత్త అనుభూతి

సరికొత్త అనుభూతి

పార్ట్62 చూసిన తర్వాత ప్రేక్షకులు సరికొత్త అనుభూతి పొందుతారని అంటున్నారు.


కథ పరంగా..

కథ పరంగా..

తొలి భాగం కథ పరంగా సగమే కావడంతో చాలా మంది నిరాశ పడ్డారు. కానీ రెండో భాగంలో పూర్తి కథ ప్రేక్షకులను సంతృఫ్తి పరుస్తుందని అంటున్నారు.


మరో అద్భుతం..

మరో అద్భుతం..

బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమా రంగంలో అద్భుతాన్ని ఆవిష్కరించిన రాజమౌళి, రెండో భాగంతో మరో అద్భుతాన్ని సృష్టించి తన రికార్డును తానే బద్దలు కొట్టుకోబోతున్నాడు.English summary
Sabu Cyril has confirmed that about 500 men from his crew are currently working on the set and props of Baahubali 2, and the work is in full swing.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu