‘బాద్‌షా’ ఓవర్ సీస్ టాకేంటి?
హైదరాబాద్ : ఎన్టీఆర్ తాజా చిత్రం 'బాద్‌షా' ఓవర్ సీస్ లో కొన్ని చోట్ల షోలు పడిపోయాయి. అక్కడ సూపర్ హిట్ టాక్ చెప్తున్నారు. గత శ్రీను వైట్ల చిత్రాల పోలికలు ఉన్నా సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీతో నడిచిందని అంటున్నారు. సినిమాలో ఎమ్.ఎస్ నారాయణ..రివేంజ్ నాగేశ్వరరావు గా అదరకొట్టాడని అంటున్నారు. ఇక బ్రహ్మానందం పద్మనాభ సింహ పాత్రలో ఓ రేంజిలో ఆడుకున్నాడని ...ఫ్యామిలీలతో చూడదగ్గ క్లీన్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. ఈ టాక్ తో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
ఇక ఇక్కడ(ఇండియాలో) ఈ రోజు( ఏప్రియల్ 5న) ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు అవుతోంది. బెనిఫిట్ షోలు ఉదయమే ప్రారంభమయిపోయాయి. అన్ని చోట్ల నుంచీ పాజిటివ్ టాక్ రన్ అవుతోంది. బండ్ల గణేష్ నిర్మించిన ఈ చిత్రం యు/ఏ సర్ట్ఫికెట్ పొందింది.
'బాద్‌షా డిసైడయితే వార్ వన్‌సైడయిపోద్ది..పత్యర్థుల వ్యూహాల్ని ముందే పసిగట్టి ఎత్తుకు పై ఎత్తు వేయడం బాద్‌షా స్టైల్. ఇంతకీ బాద్‌షా కథేంటీ? అతని గెటప్‌ల వెనకున్న ఆసక్తికరమైన రహస్యమేంటో తెలుసుకోవాలంటే 'బాద్‌షా' చూడాల్సిందే' అంటున్నారు శ్రీనువైట్ల.
నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ఈ చిత్రం ఉంటుందని, వారికోసమే ఈ చిత్రాన్ని నిర్మించామని తెలిపారు.


Click it and Unblock the Notifications











