ఫ్యాన్స్ కు థాంక్స్ చెప్పిన ఎన్.టి.ఆర్

By Srikanya

హైదరాబాద్ :. దసరా కానుకగా అభిమానుల కోసం విడుదల చేసిన ‘నాన్నకు ప్రేమతో' ఫస్ట్ టీజర్ కి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. టీజర్ ని రిలీజ్ చేసిన 36 గంటల్లోనే 1 మిలిన్ మార్క్ వ్యూస్ ని క్రాస్ చేసిన ఈ టీజర్ నేటి ఉదయానికి 2 మిలయన్ మార్క్ ని క్రాస్ చెయ్యడమే కాకుండా, 39వేల లైక్స్ ని సాధించింది.అంతే కాకుండా ఈ టీజర్ యు ట్యూబ్ లో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తోంది. దాంతో ఈ విషయమై ఆనందంతో ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ కు ధాంక్స్ చెప్తూ ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ చూడండి.

‘నాన్నకు ప్రంతో టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ నాకు మరింత ఆనందాన్ని ఇచ్చింది. వ్యూస్ లో 2 మిలియన్ మార్క్ తో పాటు 39 వేల లైక్స్ రావడం చాలా హ్యాపీ.. ఈ విషయం మా చిత్ర టీంకి చాలా పెద్ద బూస్టప్ ఇచ్చిందని' ఎన్.టి.ఆర్ ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నాడు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో'. విభిన్న తరహా కథలను తెరపై ఆవిష్కరించే సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2016 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నవంబర్ 1 నుంచి నాన్నకు ప్రేమతో ఫైనల్ షెడ్యూల్ స్పెయిన్ లో మొదలు కానుంది. ఆ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోనున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్.

చిత్రం విశేషాలకు వస్తే....

'ఆంధ్రావాలా'లో తొలిసారి రెండు పాత్రల్లో కనిపించాడు ఎన్టీఆర్‌. ఆ తరవాత 'అదుర్స్‌'లోనూ ఇద్దరిగా వినోదం పంచాడు. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడా? ఔననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు. ఎన్టీఆర్‌ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. సుకుమార్‌ దర్శకుడు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్. ప్రస్తుతం స్పెయిన్ లో చిత్రీకరణ జరుపుకొంటోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని సమాచారం.

ఓ పాత్ర కోసం గడ్డంతో, స్త్టెలిష్‌గా కనిపిస్తున్నాడు తారక్‌. ప్రస్తుతం ఆ గెటప్పే చిత్ర బృందం బయటపెట్టింది. అయితే.. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ మరో పాత్రలో కూడా కనిపిస్తాడని తెలుస్తోంది. ఆ గెటప్‌ను చిత్రబృందం గోప్యంగా ఉంచుతోంది. ఈ ఇద్దరి ఎన్టీఆర్‌ల మధ్య ఉన్న సంబంధం ఏమిటన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ చిత్రం జనవరి 8,2016న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

అలాగే ఈ సినిమా కోసం లండన్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ని 26 వ ఫ్లోర్ లో ఆఫీస్ సెట్ వేసారు. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోన్న జగపతి బాబు ఆఫీసు గా ఇది కనిపించనుంది. ఇందుకోసం 60 లక్షలకు పైనే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఇంటర్వెల్ కు ముందు జగపతిబాబుకు, ఎన్టీఆర్ కు మధ్య వచ్చే కీలక సన్నివేశం కోసం ఈ సెట్ వేసినట్లు తెలుస్తోంది. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ఈ సెట్‌కు రూపకల్పన చేశారని సమాచారం. అక్కడ లండన్ వర్కర్స్ కొందరు ఈ సెట్ నిర్మాణంలో పాలుపంచుకున్నట్లు చెప్తున్నారు.

Overwhelmed NTR thanks his fans

దర్శకుడు మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌ని కొత్త తరహా పాత్రలో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన తెరపై కనిపించే విధానం భిన్నంగా ఉంటుంది. ఇదివరకటితో పోలిస్తే మరింత స్త్టెలిష్‌గా కనిపిస్తారు. ఎన్టీఆర్‌ కోసం ప్రత్యేకంగా ఓ బైక్‌ని తయారు చేయించాం. అది చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది''అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌ సినీ ప్రయాణానికీ, మా సంస్థకి ఎంతో ప్రతిష్ఠాత్మకమైన చిత్రమిది. ఆ తర్వాత స్పెయిన్‌లో జరిగే షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుంది'' అన్నారు. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రాన్ని తమిళంలో డబ్బింగ్ చేసి అదే రోజు విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు జరగుతున్నట్లు సమాచారం. అందులో భాగంగా కొందరు తమిళ నటుల్ని కీలకమైన పాత్రలకు తీసుకుందామనే ఆలోచనలో దర్శక,నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X