మహేష్ ఎంత సీరియస్‌ సన్నివేశం అయినా...

By Srikanya

హైదరాబాద్ : ఇది వరకు మహేష్‌ నటించిన వాణిజ్య ప్రకటనలు చూశా. 'మహేష్‌తో కలసి నటిస్తా' అని ఎప్పుడూ అనుకోలేదు. ఆయన చాలా కూల్‌. ఎంత సీరియస్‌ సన్నివేశం అయినా సరే, అది చేసొచ్చాక ఎప్పట్లా సరదాగా మాట్లాడేసేవారు'' అంది కృతిసనన్. ఇంజనీరింగ్‌ పట్టా పుచ్చుకొన్న ఈ ముంబై భామ.. '1' - నేనొక్కడినేలో మహేష్‌బాబు సరసన నటించింది. ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'నా తొలి సినిమా అనుభవాలు మర్చిపోలేను' అని చెబుతోంది కృతి. చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఆమె మీడియాతో ముచ్చటించింది.

కృతిసనన్‌ మాట్లాడుతూ... 1 సినిమా అందరికీ నచ్చింది. కుటుంబ ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే థియేటర్లకు వెళ్తున్నారు. తొలి సినిమాతోనే ఇంత మంచి అవకాశం రావడం నా అదృష్టం. నాకు తెలుగు రాదు. కాకపోతే చిత్రబృందం అందించిన సహకారంతో ధైర్యంగా నటించా. వాళ్లంతా నన్ను ఓ చిన్నపిల్లలా చూసుకొన్నారు. ఈ సినిమాని మా కుటుంబ సభ్యులతో కలసి చూశా. వాళ్లంతా భాష రాకపోయినా అర్థం చేసుకొన్నారు అంది.

Kriti Sanon

' ఓ బాలీవుడ్ సినిమా అడిషన్‌కు వెళ్లిన నన్ను '1' చిత్ర దర్శక నిర్మాతలు చూడటం ఆ సినిమాకు కథానాయికగా ఎంపికచేసుకోవడం జరిగింది. తొలి చిత్రమే మహేష్‌బాబు లాంటి పెద్ద హీరో సరసన నటించే అవకాశం రావడంతో ఈ సినిమాను మరో అలోచన లేకుండా అంగీకరించాను. ఈ చిత్రంలో జర్నలిస్ట్‌గా నా పాత్రను కొత్తగా తీర్చిదిద్దారు దర్శకుడు సుకుమార్. నటిగా మొదటి సినిమాలోనే ఓ ఛాలెంజింగ్ రోల్ కావడంతో పాత్ర సహజసిద్ధంగా రావడం కోసం పాత్రికేయుల హావభావాలు ఎలా వుంటాయో కొంత మంది జర్నలిస్ట్‌ల నుంచి తెలుసుకొని ఈ పాత్రను చేశాను' అని తెలిపింది.

మహేష్‌తో లిప్‌లాక్ సన్నివేశాలలో నటించడం గురించి స్పందిస్తూ ' హీరోయిన్ గా దర్శకుడు ఏం చెబితే అది చేయడం వరకే నా బాధ్యత. సినిమాలో నా పాత్ర బాగా రావాలంటే ఆ పాత్రకు తగ్గట్లుగా నటనను, హావభావాలను ప్రదర్శించాలి.అందులో భాగమే ఈ సినిమాలో మహేష్‌తో లిప్‌లాక్‌లో నటించాను. అయినా లిప్‌లాక్‌లు అన్ని భాషల్లోనూ ఉన్నాయి' అంది కృతిసనన్.

పోస్టర్‌ వివాదం గురించి మాట్లాడుతూ ''అది పాటలో ఓ భాగం. సినిమా అంతా అలా లేదు కదా? ఓ రొమాంటిక్‌ గీతం కోసం అలా చేయాల్సివచ్చింది. నాకైతే అందులో తప్పేం కనిపించలేదు. మరిన్ని తెలుగు సినిమాల్లో నటించాలని ఉంది. కొత్తగా సినిమాలేం ఒప్పుకోలేదు. నేను ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకులు గుర్తుపడుతున్నారు. మహేష్‌ హీరోయిన్‌... అంటున్నారు. ఈ గుర్తింపు చాలు'' అని చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X