జపాన్‌లో కుమార వర్మ.. ఆడియన్స్‌ని థ్రిల్ చేసిన సుబ్బరాజు, ఇంకా తగ్గని బాహుబలి మానియా!
జపాన్ లో బాహుబలి మానియా ఇంకా కొనసాగుతోంది . ఏడాది క్రితం విడుదలైన బాహుబలి 2 చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కలెక్షన్ల ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. జపాన్ లో బాహుబలి 2 కొన్ని నెలల క్రితం విడుదలయింది. ఇప్పటికి బాహుబలి 2 చిత్రం జపాన్ ఆడియన్స్ ని అలరిస్తూనే ఉంది.

ప్రచారంలో భాగంగా నటుడు సుబ్బరాజు ఇటీవల జపాన్ లో సందడి చేశాడు. బాహుబలి 2 చిత్రంలో సుబ్బరాజు కుమార వర్మ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. కుమార వర్మ గెటప్ లోనే సుబ్బరాజు జపాన్ ఆడియన్స్ ని థ్రిల్ చేసాడు. బాహుబలి ప్రదర్శిస్తున్న థియేటర్ లో సందడి చేశాడు.
సుబ్బరాజు పర్యటనకు సంబందించిన ఫోటోలని బాహుబలి టీం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. జపాన్ ఆడియన్స్ సుబ్బరాజుకు బ్రహ్మరథం పడుతున్న దృశ్యాలు నెటిజన్స్ ని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











