బిపితో హాస్పటల్లో స్టార్ హీరోయిన్..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ అస్వస్థతకు గురై ముంబై నగరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమచారం. ఆమెకు మానసిక ఒత్తిడితో పాటు బిపి పెరగటంతో నగరంలోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో చేర్చినట్లు ఆస్రత్రి వర్గాలు వెల్లడించాయి. ఆమె తల్లిదండ్రులు కూడా ఆస్పత్రిలోనే ఉన్నట్లు తెలిసింది. ఇతర కుటుంబీకులు కూడా సాయంగా అక్కడే ఉన్నట్లు తెలిసింది. ఆమెకు ఎర్రరక్తకణాలు కౌంట్ తక్కువైనట్లు తెలిసింది. అంతేగాక రక్తస్రావం అయినపుడు అవసరమయ్యే ప్లాస్మాపదార్ధం హీమోగ్లోబిన్ కూడా తక్కువైనట్లు తెలిసింది. తింటే లావు అయిపోతామేమో అని అధికంగా డైటింగ్ చేసిన డైటింగ్ ఈ ప్రమాదం తెచ్చిపెట్టిందని తెలుస్తోంది. ఇక షూటింగ్ షెడ్యూల్స్ చాలా ఒత్తిళ్లతో కూడుకుని ఉండటం, మానసిక ఒత్తిడి పెరగటం, బిపి పెరగటం జరుగిందని చెప్తున్నారు.
ఇక విద్యాబాలన్ తాజాగా సిల్క్‌స్మిత జీవిత చరిత్ర ఆధారంగా వెండితెరకెక్కుతున్న 'డర్టీ పిక్చర్' లో నటిస్తోంది. ఈ చిత్రంలో సిల్క్‌స్మిత పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్‌లుక్, ట్రైలర్స్ విడుదదలై ప్రేక్షకుల్లో ఈ సినిమా పట్ల క్రేజ్‌ని పెరగడంతో వరల్డ్ వైడ్‌గా విడుదల చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నారు. రూ.19 కోట్లకు బిజినెస్ చేస్తుందని బాలీవుడ్ ట్రేడ్‌వర్గాలు అంచనా వేస్తున్నారు. అది తక్కువ పెట్టుబడితో ఆ రేంజి బిజెనెస్ సంపాదించటం మామూలు విషయం కాదని అంటున్నారు. ఇక ఒకప్పుడు సినిమా తెరను ఏలిన సౌతిండియా సెక్స్ బాంబ్ సిల్క్ స్మిత జీవితం ఆధారంగా.... హిందీలో 'డర్జీ పిక్చర్" సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో విద్యాబాలన్ స్మిత పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన తొలి పోస్టర్ విడుదలైంది. ఎన్నో సంచలనాలు, వివాదాలతో కూడిన సిల్క్ స్మిత జీవితం చివరకు ఆత్మహత్యతో ముగిసింది. ఆమె జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు ఈ సినిమాలో ఆవిష్కరిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏక్తాకపూర్ నిర్మిస్తుండగా, మిలన్ లుథ్రియా దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











