రిలీజ్ ముందు అంచనాలు పెంచిన ‘ఆక్సీజన్’ ప్రీ రిలీజ్ ట్రైలర్
ఆక్సీజన్ మూవీ ప్రీ రిలీజ్ ట్రైలర్ విడుదలైంది. సినిమా నవంబర్ 30 విడుదల కానుంది.
Recommended Video

గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న 'ఆక్సిజన్' మూవీ నవంబర్ 30న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రీ రీలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. గోపీచంద్ సరసన రాశీఖన్నా, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి ఎ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రీ రిలీజ్ ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. 'ప్రతీ వూరిలో నీలాంటోడు ఒకడు ఉంటాడని తెలుసు.. కానీ నాలాంటోడు ఒకడు వస్తాడని నీకు తెలియదు', 'మన శత్రువుకు శత్రువు ఉన్నాడని తెలిస్తే వాడే వెతుక్కుంటూ వస్తాడూ' అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్స్ కు మంచి స్పందన వస్తోంది.
ప్రీ రిలీజ్ ట్రైలర్ ఇదే
గోపీచంద్ శైలిలో పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారని తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించారు.
థియేట్రికల్ ట్రైలర్
ఫ్యామిలీ ఎంటర్టెన్మెంటుతో పాటు ఒక సందేశాత్మకంగా ఈ చిత్ర కథ ఉండబోతోంది. కొన్నేళ్లుగా మన సమాజంలో జరుగుతున్న, అందరికీ తెలిసిన ఓ విషయాన్నే ఇంకాస్త బలంగా చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు.

నమ్మకంగా ఉన్న గోపీచంద్
ఈ సినిమా ప్రేక్షకులకు చేరవవుతుందనే నమ్మకం ఉంది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు సందేశాత్మకంగా ఉంటుంది. ఒక మంచి సినిమా చేశామనే తృప్తి ఉందని గోపీచంద్ తెలిపారు.

నటీనటులు, టెక్నీషియన్స్
జగపతిబాబు, కిక్ శ్యామ్, అలీ, చంద్రమోహన్, నాగినీడు, బ్రహ్మాజీ, అభిమన్యు సింగ్, అమిత్, ప్రభాకర్, సాయాజీ షిండే, ఆశిష్ విద్యార్ధి, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, సితార తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి యాక్షన్: పీటర్ హైన్స్-స్టంట్ సిల్వ, కొరియోగ్రఫీ: బృంద, సినిమాటోగ్రఫీ: వెట్రి-ఛోటా కె.నాయుడు, ఎడిటింగ్: ఎస్.బి.ఉద్ధవ్, మ్యూజిక్: యువన్ శంకర్ రాజా, లిరిక్స్: శ్రీమణి-రామజోగయ్య శాస్త్రి, నిర్మాత: ఎస్.ఐశ్వర్య, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఏ.ఎం.జ్యోతికృష్ణ.


Click it and Unblock the Notifications











