Just In
Don't Miss!
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : జాబ్ కోసం నిరుద్యోగులు అకస్మాత్తుగా జర్నీ చేయొచ్చు...!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
11ఏళ్ల తరువాత మరో ప్రయోగంతో సిద్దమైన ఓయ్ దర్శకుడు.. ఈసారి ఇంకాస్త కొత్తగా..
2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓయ్ సినిమా గురించి అందరికి తెలిసే ఉంటుంది. సిద్దార్థ్, షామిలి జంటగా నటించిన ఆ సినిమాకు దర్శకుడు ఆనంద్ రంగా. ఆ సినిమాలోని పాటలు ఇప్పటికి కూడా ఎంతగానో ఆకట్టుకుంటాయి. సరికొత్త ప్రేమ కథగా రూపొందిన ఆ సినిమా ఒక ప్రయోగమనే చెప్పాలి. కానీ అనుకున్నంత రేంజ్ లో అయితే హిట్ అవ్వలేదు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా ఆ సినిమాకు మాత్రం కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారనే చెప్పాలి.
అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఆ సినిమా దర్శకుడు ఆనంద్ రంగా చాలా రోజుల తరువాత ఒక సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చాడు. 20 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉంటున్న ఆనంద్ ఓయ్ సినిమాతో స్ట్రాంగ్ ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. ఆ తరువాత సొంత ప్రొడక్షన్ హౌజ్ ను స్థాపించి పొగ అనే సినిమా కూడా తీశాడు. ఆ సినిమా థియేటర్లలోకి కూడా రాలేదు. మద్యలో ఎన్ని ప్రయోగాలు చేసిన వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు వెబ్ సిరీస్ ల హవా నడుస్తుండడంతో సరికొత్తగా షూటౌట్ ఎట్ ఆలేర్ అనే వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేశాడు.

ఈ వెబ్ సిరీస్ లో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ వంటి సీనియర్ నటులు ఉండడంతో సోషల్ మీడియాలో బజ్ బాగానే క్రియేట్ అవుతోంది. జీ5లో ఈ వెబ్ సిరీస్ విడుదల కానుంది. ఈ కంటెట్ తో ఎలాగైనా సక్సెస్ అందుకొని తన సత్తా చాటాలని అనుకుంటున్నాడు.
ఒక టెర్రరిస్ట్ పోలీసులను టార్గెట్ చేస్తూ హతమారుస్తూ ఉంటాడు. అలాంటి కేసును ఆఫీసర్స్ ఎలా డీల్ చేస్తారనేది ఈ కంటెట్ మేజర్ పాయింట్. శ్రీకాంత్ పాత్రతో పాటు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కూడా సినిమాలో చాలా పవర్ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ వెబ్ కంటెంట్ హిట్టయితే సినిమాను డైరెక్ట్ చేయాలని ఆనంద్ రంగ ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.