»   »  ముస్తాబవుతున్న ‘ఓయ్.. నిన్నే’

ముస్తాబవుతున్న ‘ఓయ్.. నిన్నే’

Posted By:
Subscribe to Filmibeat Telugu

సోలో, నువ్వా-నేనా, రా రా కృష్ణయ్య చిత్రాలను నిర్మించిన వంశీకృష్ణ శ్రీనివాస్ తాజాగా నూతన హీరో, హీరోయిన్‌ను పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం ఓయ్..నిన్నే. భరత్ మార్గాని, సృష్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా పరశురామ్, చందు మొండేటి, సుధీర్ వర్మ, కృష్ణచైతన్య వద్ద దర్శకత్వ శాఖలో పలు చిత్రాలకు పనిచేసిన సత్యం చల్లకోటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విశేషాలను నిర్మాత తెలియజేస్తూ గ్రామీణ నేపథ్యంలో నడిచే అందమైన కుటుంబ కథా చిత్రమిది. ఫ్యామిలీ ఎమోషన్స్ విత్ క్యూట్‌లవ్‌స్టోరీగా రూపొందిన ఈ చిత్రంలో అన్ని వర్గాలకు వారికి నచ్చే అంశాలున్నాయి. ఈ నెల రెండోవారంలో ఆడియోను విడుదల చేసి, చివరివారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.

Oy Ninne movie details

భరత్, సృష్టి, తనికెళ్ళభరణి, నాగినీడు, రఘుబాబు, సత్య, తాగుబోతు రమేష్, తులసి, ప్రగతి, ధన్‌రాజ్ తదితరులు నటస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: శేఖర్‌చంద్ర, పాటలు: రామజోగయ్య శాస్త్రి, ఎడిటింగ్: మార్తండ్.కె.వెంకటేష్, ఫైట్స్: వెంకట్, నిర్మాత: వంశీకృష్ణ శ్రీనివాస్, దర్శకత్వం: సత్యం చల్లకోటి.

English summary
Check out Oy Ninne movie details. The movie starring new actors Bharath Margani, Shrishti.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu