'ఓయ్' డైరక్టర్ వివాహం ఆమెతో
బేబీ షామిలీని హీరోయిన్ గా పరిచయం చేస్తూ..సిద్దార్ధ హీరోగా ఓయ్ చిత్రాన్ని రూపొందించిన ఆనంద్ రంగా ఈరోజు(ఆదివారం)వివాహం చేసుకోనున్నారు. ఇక ఆయన వివాహమాడపోయే పెళ్లి కూతరు సౌమ్య. 'రేడియో మిర్చి' రేడియో జాకీ గా పాపులర్ అయిన ఆమె డబ్బింగ్ ఆర్టిస్టుగానూ పరిశ్రమలో వారికి పరిచయస్తురాలే. ఇలియానా,కాజల్, నయనతార,అనూష్క వంటి స్టార్ హీరోయిన్స్ కు ఆమె డబ్బింగ్ చెప్తూంటారు. లేటెస్ట్ గా ఆమె 'లక్ష్యం' చిత్రంలో అనుష్కకు డబ్బింగ్ చెప్పినందుకు ఉత్తమ డబ్బింగ్ కళాకారిణిగా నంది అవార్డును సైతం గెలుచుకున్నారు. ఇక ఆనందర్ రంగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ తో రాణా హీరోగా ఓ సబ్జెక్టు ఓకే చేయించుకుని ఆ స్క్రిప్టు బిజీలో ఉన్నారు. ఇక ఈ వివాహానికి పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నట్టు సమాచారం. వీరికి దట్స్ తెలుగు వివాహ శుభాకాంక్షలు తెలుపుతోంది.
ఓయ్ దర్శకుడు ఆనంద్ రంగా ఇలియానా కాజల్ నయనతార అనూష్క లక్ష్యం సౌమ్య రేడియో మిర్చి సిద్దార్ధ oye aanad ranga siddardha soumya marriage lakshayam


Click it and Unblock the Notifications