షామిలి ఇలా ఉంటుంది

By Staff

ఓయ్ సినిమాతో పరిచయమవుతున్న షామిలీ ఎలా ఉంటుంది అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అందులోనూ ఎప్పుడో ఆమె అంజలి.జగదేకవీరుడు..అతిలోకసుందరి వంటి చిత్రాలలో బేబి షామిలీగా చూసిన వాళ్ళు ఆ తర్వాత ఆ రూపాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అలాగే ఆ తర్వాత ఆమె ఓ పంక్షన్ లో ఆమె ఫోటొను తీసి అదే నెట్ లో పాపులర్ చేస్తూ వచ్చారు. అయితే ఆ బేబీ ఇవ్వాళ క్యూట్ బేబీగా మారి కుర్రాళ్ళ గుండెలని దోచుకోనుంది. వచ్చే నెల జూలై మూడున రిలీజ్ కానున్న ఓయ్ చిత్రం ద్వారా ఆమె పరిచయం కానుంది.

సిధ్దార్ధ హీరోగా చేస్తున్న ఈ చిత్రంలో ఆమె ఫొటోలు ఇప్పటివరకూ బయిటకు రాలేదు. ప్రోమోలు లలో కూడా ఆమెను చూపటం లేదు. సిద్ధార్ధను మాత్రమే చూపుతున్నారు. అయితే నిర్మాత దానయ్య ఈ ఫొటోలను మీడియాకు రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మా చిత్రం క్లీన్ రొమాంటిక్ ఎంటర్టైనర్..యూత్ ఫుల్ ఎనర్జీతో నిండి ఉంటుంది అన్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఆమె నటన గురించి అందరూ మాట్లాడతారనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఆనంద రంగ అనే నూతన దర్శకుడు నిర్మిస్తున్నాడు. ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X