చిరంజీవి ఒళ్లో ఆటలాడా!!
జగదేకవీరుడు అతిలోక సుందరి సమయంలో చిరంజీవి సార్, శ్రీదేవి..నన్ను ఒళ్లో కూర్చోపెట్టుకుని ఆడుకున్న విషయాలన్నీ గుర్తున్నాయి. ఆ సినిమా అంతా చాలా సరదాగా సాగింది అంటోంది తన చిన్ననాటి జ్ఞాపకాలను తలుచుకుంటూ షామిలి. ఓయ్ సినిమాతో మళ్ళీ తెలుగు తెరపైకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా మీడియాతో మాట్లాడింది. అలాగే తను షారూఖ్ కి వీర ఫ్యాన్ అని చెప్తోంది. తనింట్లో అన్ని చోట్లా షారుఖ్ ఫొటోలే కనిపిస్తాయి అంటోంది.
అలాగే షారూఖ్ ని కలుసుకున్న క్షణాలను గుర్తు చేసుకుంటూ అజిత్..మా అక్కను పెళ్లి చేసుకోక ముందు సిఫారసు చేయమని నన్నడిగేవాడు. చేస్తే నాకేంటి? అని అడిగేదాన్ని. మీ షారుఖ్ దగ్గరకు తీసుకెళ్తాను అనేవాడు. వాళ్ల పెళ్లయ్యాక ఓ రోజు షారుఖ్ దగ్గరకు తీసుకెళ్లారు. ఆయనకి నన్ను పరిచయం చేశారు. ఆప్యాయంగా కౌగలించుకుని నా సినిమాలు చూశానని చెప్పారు. నా జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణాలు అవే అంది అదీ సంగతి. అటు మెగాస్టార్ ని, ఇటు బాలీవుడ్ బాద్షాని మెప్పించిన షామిలి ఓయ్ తో యూత్ లోనూ తనకంటూ ఫ్యాన్స్ ని సంపాదించుకుంటోంది.


Click it and Unblock the Notifications











