‘ఎక్స్ పోజింగా, అమ్మో వద్దు’
ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన 'ఓయ్" చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమైన షామిలీ క్రైస్తవ కుటుంబంలో పుట్టిన అమ్మాయి. కానీ తనకి హిందు ధర్మం భాగా తెలుసంటోంది. హిందువులు చేసినట్టుగానే వ్రతాలు, ఉపవాసాలు, నోములు కూడా చేస్తానని, ఏ దేవుడికి ఎలా పూజలు చేయాలో తేలుసునంటోంది షామిలీ.
ఇక సినిమా విషయానికొస్తే ఒకప్పుడు బాలనటిగా చాలా బాగా నటించి అంజలి సినిమాకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా జాతీయ ఫిల్మ్ అవార్డును అందుకొన్నది. ఇప్పుడు 'ఓయ్" అంటూ ప్రేక్షకులను పలుకరించిన హీరోయిన్ ఏమంత బాగా చేయలేదని, స్పెషల్ అట్రాక్షన్ ఏమీ లేదని ప్రేక్షకుల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని రెండో చిత్రం కోసం చాలా గ్యాప్ తీసుకోనుందట. ఎక్స్ పోజింగ్విషయంలో నాకు చాలా హద్దులున్నాయి.బాలనటిగా తనను చూసిన ప్రేక్షకులు వల్గర్ గా కన్పిస్తే జీర్ణించుకోలేరంటూ ప్రస్తుతానికి ఎక్స్ పోజింగ్ కి దూరమేనని అంటోంది. కాగా కొద్దికాలం పాటు సింగపూర్లో చదువుకోసం వెళ్తానని ఈ మద్యన ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. విదేశాలనుంచి తిరిగొచ్చాక మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతానని అంటోంది. సింగపూర్ వెళ్తున్నదీ ఫిలిం మేకింగ్ లో కోర్సే కాబట్టి సినీ పరిశ్రమకి తానేమీ దూరమవడంలేదని చెబుతోన్న షామిలి బ్రేక్ తర్వాత ఎలాంటి పాత్రలు వేస్తుందో వేచి చూడాలి మరి.


Click it and Unblock the Notifications











