నాన్ బ్రాహ్మిణ్స్ కే ప్రిఫెరెన్స్ ఇస్తాను...గాయని పి.సుశీల
ప్రముఖ గాయని పి.సుశీల డబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని 76 అడుగుపెట్టిన సందర్భంగా తమిళనాడు,ఆంద్రప్రదేశ్ గవర్నమెంట్ లను ఓ కోరిక కోరారు. ఆమె మాటల్లోనే అది...నేను నా సొంత డబ్బుతో...పెద్ద సంగీత పాఠశాలలను హైదరాబాద్, చెన్నైలలో స్ధాపిస్తాను. అందుకు మీరు నాకు ధన సాయం చేయనక్కర్లేదు. అయితే గవర్నమెంట్ మిగతా ఫర్మిషన్స్ విషయంలో నాకు సపోర్ట్ చేయాలి. అలాగే నేను బ్రాహ్మణులు కానివారికే ఈ పాఠశాలలో ప్రాదాన్యత ఇస్తాను. వారిలో సంగీత పట్ల అభిరుచిని, జ్ఞానాన్ని పెంచుతాను అన్నారామె. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషా చిత్రాల్లో వేలాది పాటలు పాడిన సుశీలకు పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. 2001లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రఘుపతి వెంకయ్య అవార్డు స్వీకరించారు. జాతీయ స్థాయిలో ఉత్తమ గాయనిగా రెండుసార్లు 1969లో, 1971లో తమిళ చిత్రాల్లో పాడినందుకు స్వీకరించారు. ఆంధ్రాయూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. తమిళనాడు ప్రభుత్వం నుంచి 'కలైమామణి' బిరుదు అందుకున్నారు. ఎన్నో పాటలు పాడిన సుశీలకు చక్రవాకంలోని 'వీణలోనా..' పాట అంటే చాలా ఇష్టం.


Click it and Unblock the Notifications











