Paagal Movie DIrect OTT Release: క్లారిటీ ఇచ్చిన హీరో విశ్వక్ సేన్!

టాలెంటేట్ యువ హీరో విశ్వక్ సేన్ త్వరలోనే పాగల్ అనే మరో విభిన్నమైన సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. ఈ నగరానికి ఏమైంది సినిమాతో యూత్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న ఈ హైదరాబాద్ హీరో అనంతరం ఫలక్ నుమా దాస్ సినిమాతో మరొక ట్రెండ్ సెట్ చేసిన విషయం తెలిసిందే.

ఎలాంటి సినిమా చేసినా కూడా ఎవరు ట్రై చేయని విధంగా ఉండాలని విశ్వక్ చాలా కొత్తగా ఆలోచిస్తున్నాడు. తన మాటలతోనే అభిమానులకు చాలా దగ్గరవుతున్నాడు. ఇక నెక్స్ట్ రాబోతున్న పాగల్ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. సినిమాకు సంబంధించిన ఓ పాట కూడా మంచి హైప్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు రూమర్స్ వచ్చాయి.

Paagal movie ott release fake news confirmed by vishwak sen

అయితే అందులో ఎలాంటి నిజం లేదని హీరో విశ్వక్ సేన్ ఒక క్లారిటి అయితే ఇచ్చేశాడు. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్ లో నిర్మించిన విషయం తెలిసిందే. అసలైతే ఈ సమ్మర్ లోనే రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికి మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బ కొట్టిన విషయం తెలిసిందే. ఇక చిన్న సినిమాలు చాలా వరకు ఓటీటీకి వెలుతుండడంతో పాగల్ కూడా ఫిక్స్ అయినట్లు టాక్ వచ్చింది. కానీ అది నిజం కాదని హీరో రూమర్స్ కు చెక్ పెట్టాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X