స్టన్నింగ్ లుక్: 'స్నేక్ మ్యాన్'గా శరత్ కుమార్.. పెద్ద ప్రయోగమే!

తమిళ నటుడు శరత్ కుమార్ తన కెరీర్ లోనే అతిపెద్ద ప్రయోగం చేస్తున్నారు. ఇప్పటి వరకు తాను చేసిన పాత్రలకు ఏమాత్రం సంబంధం లేని ఒక ఫాంటసీ రోల్‌లో కనిపించబోతున్నారు. 'పాంబన్' సినిమా కోసం ఆయన పాత్రను తీర్చిదిద్దుతున్న తీరు అద్భుతం అనేలా ఉంది. తాజాగా విడులైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా మారింది.

 శరత్ కుమార్.. పాంబన్:

శరత్ కుమార్.. పాంబన్:

మాస్, కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అయిన కోలీవుడ్ డైరెక్టర్ వెంకటేష్ 'పాంబన్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ఎస్‌కె నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నేడు చెన్నైలో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాకు శ్రీకాంత్ దేవా సంగీతం అందిస్తున్నారు.

 సోషియో ఫాంటసీ:

సోషియో ఫాంటసీ:

గతంలో శరత్ కుమార్- వెంకటేష్ కాంబినేషన్‌లో సందమారుతం,మహాప్రభు, చాణక్య వంటి సినిమాలు వచ్చాయి. అయితే అవన్నీ ఔట్&ఔట్ కమర్షియల్ సినిమాలు కాగా.. 'పాంబన్' మాత్రం సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతోంది.

 'స్నేక్ మ్యాన్' గెటప్:

'స్నేక్ మ్యాన్' గెటప్:

తాజాగా విడులైన ఫస్ట్ లుక్‌లో నీలికళ్లతో..అచ్చు పాము అవతారాన్ని తలపించేలా కనిపిస్తున్నారు శరత్ కుమార్. ఒకరకంగా ఇది 'స్నేక్ మ్యాన్' గెటప్ అని చెప్పవచ్చు. నాగవంశానికి చెందిన రాజు కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

 అమీష్ మెలూహ ఛాయలు:

అమీష్ మెలూహ ఛాయలు:

శరత్ కుమార్ 'పాంబన్' లుక్ చూస్తుంటే.. ప్రముఖ రచయిత అమీష్ రాసిన 'మెలూహా' గుర్తుకురాకమానదు. పైగా మెలూహా కథ కూడా నాగవంశానికి చెందిన కథే కావడం గమనార్హం. కాబట్టి దర్శకుడు ఈ కథను స్ఫూర్తిగా తీసుకున్నారా?.. లేక సరికొత్త కథాంశంతో వస్తున్నారా? అన్నది వేచి చూడాల్సిందే.

శరత్ కుమార్ తెలుగు సినిమాలు:

ఇటీవలే బోయపాటి దర్శకత్వంలో వచ్చిన 'జయ జానకి నాయక' సినిమాలో శరత్ కుమార్ కనిపించారు. త్వరలో విడుదల కాబోతున్న 'నా పేరు సూర్య' , 'భరత్ అనే నేను' ' సాక్ష్యం' సినిమాల్లోనూ ఆయన కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X