నా కల నిజమైంది.. ప్రేమిస్తున్నా.. ఎమోషనల్ అయిన పాయల్ రాజ్‌పుత్

చిత్రసీమలో ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డు దాదా సాహెబ్ ఫాల్కే. భారతీయ చలన చిత్ర పితామహుడిగా పేరొందిన దాదా సాహెబ్ ఫాల్కే పేరిట ఈ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంటుంది. తాజాగా ఈ ప్రతిష్టాత్మక అవార్డుని పాల బుగ్గల పాప పాయల్ రాజ్‌పుత్ దక్కించుకుంది. దీంతో ఆ ఆనందం పట్టలేక ఆనంద భాష్పాలు కార్చింది. వివరాల్లోకి పోతే..

దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్

దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్

దాదా సాహెబ్ ఫాల్కే 150వ జయంతి సందర్భంగా ‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్' నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా దాదా సాహెబ్ ఫాల్కే సౌత్ 2019 అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. హైదరాబాద్ లో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగటం ఇదే తొలిసారి.

మహేష్ బాబు, పాయల్ రాజ్‌పుత్‌

మహేష్ బాబు, పాయల్ రాజ్‌పుత్‌

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ హాజరై తన చేతుల మీదుగా విజేతలకు అవార్డులు అందజేశారు. ఇందులో భాగంగా ఉత్తమ నటుడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నిక కాగా.. ఉత్తమ డెబ్యూ (ఫీమేల్) కేటగిరీలో పాయల్ రాజ్‌పుత్‌ని దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది.

Rx100 తోనే గాలం

Rx100 తోనే గాలం

తొలి సినిమా Rx100 తోనే కుర్రకారు మనసు దోచుకుంది పాయల్ రాజ్‌పుత్‌. తన అందచందాలు ఆరబోస్తూ అభినయంతో ఆకట్టుకుంది. ఇదే ఆమెకు తొలి సినిమా. ఈ చిత్రానికి గాను ఆమె బెస్ట్ డెబ్యూ (ఫీమేల్) కేటగిరీలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు దక్కించుకుంది.

నా కల నిజమైంది.. పాయల్ ఆనంద భాష్పాలు

ఈ మేరకు తనకు ఈ అవార్డు రావడం పట్ల సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేసింది పాయల్. తన కల నిజమైందని పేర్కొంటూ ఆనంద భాష్పాలు కార్చింది. ఈ మేరకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో దిగిన పిక్ షేర్ చేసింది. దీంతో ఆమె చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది.

ప్రేమిస్తున్నా అంటూ మరో పోస్ట్

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు దక్కించుకున్న సమయంలో వేదికపై ఎమోషనల్ గా ఫీల్ అయింది పాయల్. ఆ పిక్ కూడా షేర్ చేస్తూ ఈ పిక్‌ని పేమిస్తున్నా. ఎప్పటికీ మరచిపోలేను అని ట్వీట్ చేసింది. దీంతో పాయల్‌కి పెద్ద ఎత్తున కంగ్రాట్స్ చెబుతున్నారు నెటిజన్లు.

RDX లవ్.. ఆగలేకపోతున్నారు

RDX లవ్.. ఆగలేకపోతున్నారు

ఇక అక్టోబర్ 11వ తేదీన విడుదలకు కాబోతున్న RDX లవ్ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆతృతగా ఉన్నారు యువత. ఊరి కోసం పాటుపడే మహిళగా ఈ సినిమాలో కనిపించనుంది పాయల్. స్టోరీ లైన్‌తో పాటు యూత్‌కి కావాల్సిన అన్ని అంశాలు మేళవించి ఈ సినిమాను రూపొందించారు మేకర్స్.

RDX లవ్ మూవీ

RDX లవ్ మూవీ

'RDX లవ్' చిత్రాన్ని హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ నిర్మించారు. శంకర్ భాను దర్శకత్వం వహించారు. 'హుషారు' మూవీ ఫేం తేజస్, పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్లుగా నటించారు. నరేష్, నాగినీడు, తులసి, ఆమని ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. రాధన్ సంగీతం అందించగా, రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ హ్యాండిల్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X