RDX లవ్: ఆడది వేటాడితే మగసింహం కూడా కుక్కపిల్లలా.. పాయల్ రాజ్‌పుత్ కేక

Recommended Video

RDX Love Trailer - Paayal Rajput, Tejus Kancherla

టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో యూత్‌ను ఆకట్టుకొంటున్న సినిమా RDX లవ్. ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ హ్యాపీ బ్యానర్‌పై రూపొందించిన ఈ సినిమాకు శంకర్ భాను దర్శకత్వం వహించారు. RX 100 హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్, యువ హీరో తేజస్ కంచెర్ల జంటగా నటించారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా విడుదల చేసిన పాయల్, తేజస్ రొమాంటిక్ పోస్టర్లు విశేషంగా ఆకట్టుకొన్నాయి. శృంగారం మితిమీరిందనే మాట వినిపించినా యూత్‌ను హుషారెత్తించాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ ఎలా ఉందంటే..

ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో

ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో

RDX లవ్ సినిమా రొమాంటిక్ ప్రేమకథగా ముందుగా అనుకొన్నప్పటికీ.. ఓ గ్రామానికి సంబంధించిన ఎమోషనల్ స్టోరి అనేది స్పష్టంగా అర్థమైంది. కాకపోతే గ్రామంలోని సమస్యపై హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ చేసే పోరాటం నేపథ్యంగా తెరకెక్కినట్టు స్పష్టమైంది. ఈ కథలో రొమాన్స్‌ను ప్రధానాంశంగా చేసుకొని కథను అల్లుకొన్నట్టు ట్రైలర్ చెప్పకనే చెప్పింది.

పవర్ ఫుల్ డైలాగ్స్‌తో

‘వేటాడాలనుకొన్న మగాడికి ఆడపిల్ల లేడిపిల్లలా కనిపిస్తుంది. అదే వేటాడాలని అనుకొన్న ఆడపిల్లకు మగ సింహం కూడా కుక్క పిల్లలా కనిపిస్తుంది', ‘క్యారెక్టర్ ఉన్న ఆడపిల్ల మాటనే అగ్రిమెంట్',
‘అమ్మాయిలతో మాట్లాడాలంటే నిజం చెప్పి బతిమిలాడండి.. కరిగిపోతారు. అబద్ధం చెప్పి పాతి పెట్టకండి. కరిగించేస్తారు' అని పాయల్ చెప్పిన డైలాగ్స్ RDX లవ్ ట్రైలర్‌లో ఆకట్టుకొన్నాయి.

హీరో, హీరోయిన్ల రొమాన్స్

హీరో, హీరోయిన్ల రొమాన్స్

RDX లవ్ ట్రైలర్‌లోనూ ఎమోషనల్ కంటెంట్‌ను జొప్పించారు. నటుడు నరేష్ విగ్రహాన్ని పట్టుకొని రావడం కథలోని ఇంటెన్సిటీని చెప్పింది. అలాగే హీరో, హీరోయిన్ల రొమాన్స్ మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రకరకాల ఎమోషన్స్‌తో ట్రైలర్ పూర్తిగా సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది.

నటీనటులు, సాంకేతిక వర్గం

నటీనటులు, సాంకేతిక వర్గం

నటీనటులు: పాయల్ రాజ్‌పుత్, తేజస్ కంచెర్ల, వీకే నరేష్, నాగినీడు, తులసి, ఆదిత్య మీనన్, ముమైత్ ఖాన్ తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శంకర్ భాను
నిర్మాత: సీ కల్యాణ్
కో ప్రొడ్యూసర్: సీవీ రావు
సంగీతం: రాధన్
సినిమాటోగ్రఫి: సీ రాం ప్రసాద్
ఎడిటర్: ప్రవీణ్ పుడి
సాహిత్యం: భాస్కరభట్ల
మాటలు: పరశురాం

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X