For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాయల్ రాజ్‌పుత్ మరో విజయశాంతి.. శీలం పణంగా పెట్టే పాత్రలో..

|

హుషారు ఫేమ్ తేజస్ కంచర్ల హీరోగా, ఆర్.ఎక్స్ 100 భామ పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్ లో టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ భాను దర్శకుడిగా హ్యాపీ మూవీస్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మిస్తోన్న చిత్రం ఆర్డీఎక్స్ లవ్. ఈ చిత్రం టీజర్ నాలుగు మిలియన్ వ్యూస్ పైగా రాబట్టుకొని సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. దీంతో సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ నెలకొని వున్నాయి. కాగా ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం సెప్టెంబర్ 10న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది.

సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ముఖ్య అతిధిగా విచ్చేసి ఆర్డీఎక్స్ లవ్ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేసారు. ఈ కార్యక్రమంలో హీరో తేజస్ కంచర్ల, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, దర్శకుడు శంకర్ భాను, ప్రముఖ నిర్మాతలు మల్లిడి సత్యనారాయణ రెడ్డి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ పాల్గొనగా నిర్మాత సి.కళ్యాణ్ బొకేలతో అతిధులకు స్వాగతం పలికారు.

కథను నమ్మి బడ్జెట్‌కి వెనుకాడకుండా

కథను నమ్మి బడ్జెట్‌కి వెనుకాడకుండా

డైరెక్టర్ వి.వివి.వినాయక్ మాట్లాడుతూ.. కళ్యాణ్ గారు డబ్బులకోసం కాకుండా నిత్యం ఫ్యాషన్ తో సినిమాలను తీస్తున్నారు. ఈ కథని నమ్మి బడ్జెట్ కి వెనుకాడకుండా చాలా రిచ్ గా ఆర్డీఎక్స్ లవ్ చిత్రాన్ని నిర్మించారు. నా స్నేహితుడు శంకర్ భానుకి చాన్స్ ఇచ్చిన కళ్యాణ్ గారికి నా థాంక్స్. ఈ చిత్రంతో కళ్యాణ్ గారు పెద్ద హిట్ కొట్టబోతున్నారు. దర్శకుడు శంకర్ భాను నాతోపాటే అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసాడు. చాలా తెలివైన వాడు. చాలా మంచి సినిమాలు చేసాడు.. కానీ సరైన బ్రేక్ రాలేదు. ఈ సినిమాతో కమర్షియల్ డైరెక్టర్ గా భానుకి పెద్ద బ్రేక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తేజస్, పాయల్ పెయిర్ చాలా బాగుంది. ఈ సినిమా వాళ్ళిద్దరికీ మంచి పేరు తేవాలి. అలాగే పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాతో విజయశాంతి గారిలా స్టార్ ఇమేజ్ తెచ్చుకోవాలి అన్నారు.

శీలాన్ని పణంగా పెట్టి

శీలాన్ని పణంగా పెట్టి

నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. ఈ సినిమా టీజర్‌కి 4 మిలియన్ వ్యూస్ పైగా వచ్చాయి. నేను ఏ లక్ష్యంతో అయితే ఈ సినిమాని స్టార్ట్ చేశానో అది ఆర్డీఎక్స్ లవ్ బ్లాస్ట్ అయి నిరూపిస్తుంది. టీజర్ రిలీజ్ అయినప్పుడు చాలా మంది కామెంట్స్ చేసారు.. అలాగే గొప్పగా ఉందని పొగిడిన వారు వున్నారు. ఒక యుక్త వయసులో వున్న అమ్మాయి ఎంజాయ్ చేసే టైములో అవన్నీ వదులుకొని తన గ్రామం కోసం, చుట్టుప్రక్కల గ్రామాల ఆశయ సాధనకోసం తన శీలాన్ని సైతం పణంగా పెట్టి ఏవిధంగా పోరాడిందనేది చిత్ర కథాంశం. డెఫినెట్ గా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాస్ట్ అవుతుంది అన్న నమ్మకంవుంది. ఈ చిత్రం తర్వాత పాయల్ మరో విజయశాంతి అవుతుంది. అంత గొప్పగా ఈ చిత్రంలో నటించింది. విజయవాడ, పోలవరం, రంపచోడవరమ్ లలో 45 డిగ్రీల టెంపరేచర్లో కూడా నటీనటులు, టెక్నీషియన్స్ అందరు ఎంతో కస్టపడి వర్క్ చేసారు. ముఖ్యంగా కెమెరామెన్ రాంప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా సహకారం మరువలేనిది అని అన్నారు.

విజువల్స్ చాలా రిచ్‌గా

విజువల్స్ చాలా రిచ్‌గా

చిన్న బడ్జెట్ లో కాకుండా కథని నమ్మి పెద్ద బడ్జెట్ లోనే 75 రోజుల పాటు ఈ చిత్రాన్ని కాంప్రమైజ్ కాకుండా తీశాం. అందుకొనే చాలా రిచ్ గా విజువల్స్ వున్నాయి. ఒక కసితో గొప్ప సినిమా తియ్యాలని చేశాను. హీరో తేజస్, పాయల్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. రథన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఆదిత్య మీనన్ విలన్ గా నటించాడు. నరేష్, తులసీల నటన క్లైమాక్స్ లో కంట తడి పెట్టిస్తుంది. ప్రేక్షకులకు ఒక గొప్ప సినిమా చుసిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ క్రెడిట్ భానుకె దక్కుతుంది. సెన్సార్ పూర్తయింది.. మంచి డేట్ చూసుకొని త్వరలో సినిమా రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నాం అని సీ కల్యాణ్ అన్నారు.

నా మీద నమ్మకంతో

నా మీద నమ్మకంతో

హీరో తేజస్ కంచెర్ల మాట్లాడుతూ.. నా మీద నమ్మకంతో ఈ చిత్రంలో నటించే ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ గారికి నా కృతజ్ఞతలు. టీమ్ వర్క్ తో సినిమాని అందరమ్ కష్టపడి చేసాం. టీజర్ కి రకరకాల కామెంట్లు వచ్చాయి. ట్రైలర్ చూస్తే సినిమా కంటెంట్ తెలుస్తుంది. పాయల్ బాగా కోపరేట్ చేసి ఈ సినిమాలో నటించింది. డైరెక్టర్ శంకర్ భాను చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. వినాయక్ గారు మా ట్రైలర్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా వుంది అన్నారు.

నా లైఫ్ మారిపోయింది.. పాయల్

నా లైఫ్ మారిపోయింది.. పాయల్

హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ మాట్లాడుతూ.. "ఆర్ ఎక్స్ 100" చిత్రంతో ఒక్కసారిగా నా లైఫ్ మారిపోయింది. ఆర్డీఎక్స్ లవ్ చిత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఎడ్యుకేషన్ పరంగా ఆలోచింప చేస్తూ.. ఇన్స్పిరేషన్ గా ఈ చిత్రం నిలుస్తుంది. వెరీ హార్ట్ టచ్చింగ్ మూవీ. ఇంత మంచి మూవీలో నటించే ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ గారికి, భాను గారికి నా థాంక్స్.. అన్నారు.

సినిమా బ్లాక్ బస్టర్ గ్యారెంటీ

సినిమా బ్లాక్ బస్టర్ గ్యారెంటీ

దర్శకుడు శంకర్ భాను మాట్లాడుతూ.. కథ విని కళ్యాణ్ గారు ప్రోత్సహించారు. కథ కి ఏంకావాలో అవన్నీ ప్రొవైడ్ చేసి సూపర్బ్ క్వాలిటీతో ఈ చిత్రాన్ని కళ్యాణ్ గారు నిర్మించారు. హ్యాపీ మూవీస్, సీకే ఎంటర్టైన్మెంట్స్ లో ఈ సినిమా చేయడం చాలా ప్రౌడ్ గా ఫీలవుతున్నాను. తేజస్, పాయల్ ల మ్యాజిక్ వండర్స్ క్రియేట్ చేస్తుంది. రాంప్రసాద్ కెమెరా వర్క్, ఆర్ట్ చిన్న సెట్ వర్క్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా నిలుస్తాయి. రథన్ వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. ఆర్డీఎక్స్ లవ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని కాన్ఫిడెంట్ గా వున్నాను. ఈ బ్లాస్టింగ్ హిట్ తో కళ్యాణ్ గారి సంస్థ గొప్ప ప్రొడక్షన్ కంపినీ అవుతుంది. ఈ మూవీ తరువాత ఈ బ్యానర్ లో వరుస కమర్షియల్ సక్సెస్ లు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను... అన్నారు.

నటీనటులు, సాంకేతిక వర్గం

నటీనటులు, సాంకేతిక వర్గం

నటీనటులు: పాయల్ రాజ్‌పుత్, తేజస్ కంచెర్ల, వీకే నరేష్, నాగినీడు, తులసి, ఆదిత్య మీనన్, ముమైత్ ఖాన్ తదితరులు

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శంకర్ భాను

నిర్మాత: సీ కల్యాణ్

కో ప్రొడ్యూసర్: సీవీ రావు

సంగీతం: రాధన్

సినిమాటోగ్రఫి: సీ రాం ప్రసాద్

ఎడిటర్: ప్రవీణ్ పుడి

సాహిత్యం: భాస్కరభట్ల

మాటలు: పరశురాం

English summary
RDX Love Trailer featuring Tejus Kancherla, Paayal Rajput, Dr V.K. Naresh, Nagineedu,Adityamenon,Tulasi,Aamani, Mumaith Khan,Vidhyullekha Raman,Satyasri,Sahithi Jadi,Devi Sri, Zoya Mirza And Others. This trailer consists Emotional content
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more