జీవితకు ఇదో ఫ్యాషన్ అయిపోయింది, గతంలో చిరంజీవిపై ఇలానే... : కౌశిక్ రెడ్డి రివర్స్ ఎటాక్

రాజశేఖర్ సోదరుడు గుణశేఖర్‌కు సంబంధించిన డైమండ్ షోరూం వద్ద కారు పార్కింగ్ విషయంలో జరిగిన వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. రాజశేఖర్ భార్య జీవిత, గుణశేఖర్ కలిసి ఈ వివాదంలో కౌశిక్ రెడ్డి అనే వ్యక్తిపై ఫిర్యాదు చేశారు.

ఇక్కడ కారు ఎందుకు పార్క్ చేశారని అడిగినందుకు కౌశిక్ రెడ్డి దుర్భాషలాడుతూ... గుణశేఖర్ మీద దాడి చేశారని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డి తీరుపై జీవిత మీడియాతో మాట్లాడుతూ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. కౌశిక్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు.

కౌశిక్ రెడ్డి స్పందన...

కౌశిక్ రెడ్డి స్పందన...

నేను నా మిత్రుడు రోడ్ నెం.45లో వెళుతూ ఉంటే... నా మిత్రుడి కుమారుడు దాహం వేయడంతో వాటర్ కావాలని ఏడిస్తే తేవడానికి కారు పార్క్ చేసి కాఫీడేకు వెళ్లాం. ఆ కార్ పార్కింగ్ వారిది అని కూడా నాకు తెలియదు. మేము వెళ్లి నీళ్లు తీసుకుని, కాఫీ తాగి బయటకు వచ్చిన తర్వాత కారు దగ్గరకు రాగానే ఆయన(గుణశేఖర్) ఎవరో కూడా నాకు తెలియదు దుర్భాషలాడుతూ, మీడియా ముందు చెప్పడానికి వీల్లేని బూతులు తిడుతూ నన్ను తోసేయడం జరిగింది. నేను కూడా వెంటనే రియాక్ట్ అయి ఆయన్ను తోసేశాను. ఇద్దరం తిట్టుకున్నాం. వెళ్లిపోయాం. అదీ అక్కడ జరిగిందిన విషయం అని కౌశిక్ రెడ్డి తెలిపారు.

నేను ముక్కు భూమికి రాకడానికి సిద్ధం

నేను ముక్కు భూమికి రాకడానికి సిద్ధం

ఆ వ్యక్తి రాజశేఖర్ సోదరుడు గుణశేఖర్ అని కూడా నాకు తెలియదు. నేనెవరో ఆయనకు తెలియదు. ఒక చిన్న పిల్లాడికి నీళ్లు తేవడానికి 10 నిమిషాలు కారు పార్క్ చేసి వెళితే తప్పా? జీవిత గారు ఈ విషయాన్ని ఇంత పెద్ద ఇష్యూ చేయడం అవసరమా? నేను కొడితే ఆయన ఆస్పిటల్‌లో అడ్మిట్ అయినట్లు ఆరోపిస్తున్నారు. వారు పోలీసులకు ఇచ్చిన వీడియో ఫుటేజీలో కూడా నేను కొట్టినట్లు ఎక్కడా లేదు. అలా ఉంటే నేను నడి రోడ్డు మీద ముక్కు భూమికి రాకడానికి సిద్ధమని స్పష్టం చేశారు.

గతంలో చిరంజీవి మీద కూడా...

గతంలో చిరంజీవి మీద కూడా...

నాకు కాంగ్రెస్ టిక్కెట్ ఎందుకు ఇచ్చారు? రౌడీలు అదీ ఇదీ అంటూ జీవితగారు మాట్లాడుతున్నారు. అయ్యో... జీవితక్కా, మీకు నేనెవరో తెలియక పోవచ్చు. కౌశిక్ రెడ్డి ఒక క్రికెటర్. దేశానికి జెండా మోసిన వ్యక్తిని. రౌడీ షీటర్ కాదు. జీవితగారి లాగా వారానికొకసారి కోర్టు మెట్లు ఎక్కే వ్యక్తి కాదు. మీడియా ముందుకొచ్చి ఇలాంటివి వివాదాలు చేయడం ఆమెకు తమాషా అయిపోయింది. గతంలో కూడా చిరంజీవిగారి మీద, అరవింద్ గారి మీద ఇలానే తమాషా చేశారు అంటూ మండి పడ్డారు.

ఆమెను పట్టించుకునే వారు లేకనే...

ఆమెను పట్టించుకునే వారు లేకనే...

ఈవిడను పట్టించుకునేవారు ఎవరూ లేరు కాబట్టి ఎప్పుడూ ఒక సెన్సేషన్ న్యూస్ క్రియేట్ చేయడానికి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాలి. మీడియాలో ఆ విషయంపై రచ్చ చేయాలి. శనివారం జరిగిన సంఘటనపై సోమవారం ఎందుకు కంప్లయింట్ చేశారు? రాజకీయంగా నన్ను డ్యామేజ్ చేయడానికే ఇలా చేస్తున్నారు. జీవిత గారికి ఇలా వివాదాలు పెట్టుకోవడం ఫ్యాషన్ గా మారిపోయింది. గుణశేఖర్ అనే వ్యక్తి నా డ్రైవర్, దళితుడైన వ్యక్తిని కులం పేరు మీద దూషించాడు. వాళ్లే తోసేసి, వాళ్లే వచ్చి కేసు పెడుతున్నారు. ఈ కేసులో విచారణకు నేను సిద్ధంగా ఉన్నాను. ఏదైనా తప్పు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోండి. తప్పుచేయకపోతే జీవిత, గుణవేఖర్ మీద చర్య తీసుకోవాలి. నేను గుణశేఖర్ మీద, జీవిత మీద కంప్లయింట్ ఇచ్చాను. నా డ్రైవర్ కులం పేరుతో దూషించినట్లు కంప్లయింట్ ఇచ్చారు.. అని కౌశిక్ రెడ్డి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X