twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పడిపడి లేచె మనసు ప్రీ రిలీజ్ రివ్యూ: క్యూట్ లవ్‌స్టోరితో సాయిపల్లవి, శర్వానంద్!

    |

    గమ్యం, ప్రస్థానం, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, శతమానం భవతి, రాధా లాంటి హిట్లతో టాలీవుడ్‌లో దూసుకెళ్తున్న శర్వానంద్ తాజాగా నటించిన చిత్రం పడిపడి లేచె మనసు. ఈ చిత్రానికి అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ లాంటి సక్సెస్‌లను అందించిన హను రాఘవపుడి దర్శకుడు. ఫిదా, ఎంసీఏ లాంటి చిత్రాలతో దుమ్మురేపిన సాయిపల్లవి కథానాయిక. వీరిందరి కలయికలో రూపొందిన అందమైన ప్రేమకథ డిసెంబర్ 21 రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకొనే అంశాలు ఇవే..

    కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌గా

    కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌గా

    తెలుగు సినిమాల విజయాలకు సెంటిమెంట్‌గా మారిన కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌గా ఈ సినిమా రూపొందింది. కోల్‌కతాలోని కిక్కిరిసిన ప్రాంతాల్లో ఈ ప్రేమకథను హను రాఘవపుడి తెరకెక్కించారు. ఈ చిత్రంలో సూర్య పాత్రలో ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా శర్వానంద్ కనిపిస్తారు. సూర్యుడిలా ప్రకాశించేలా ఉండాలని ఈ పాత్రకు హను రాఘవపుడి పేరుపెట్టారట.

    సాయిపల్లవి డాక్టర్ పాత్రలో

    సాయిపల్లవి డాక్టర్ పాత్రలో

    ఇక సాయిపల్లవి నిజజీవితంలో పాత్రను పోషిస్తున్నది. ఈ చిత్రంలో సాయిపల్లవి మెడికోగా కనిపించనున్నారు. అందం, అభినయం కలబోసిన పాత్రలో సాయిపల్లవి కనిపించబోతున్నది. శర్వానంద్, సాయిపల్లవి కెమిస్ట్రీ సినిమాకు హైలెట్ అని చెప్పుకొంటున్నారు. ఇక సాయిపల్లవి మరోసారి డ్యాన్సులతో ఇరుగదీసిందనేది తాజా సమాచారం.

    నేపాల్, ఖాట్మండ్‌ లాంటి ప్రదేశాల్లో

    నేపాల్, ఖాట్మండ్‌ లాంటి ప్రదేశాల్లో

    కోల్‌కతా, నేపాల్, ఖాట్మండ్ లాంటి అందమైన లోకేషన్లలో పడి పడి లేచె మనసు సినిమాను తెరకెక్కించారు. ఇప్పటి వరకు తెలుగు సినీ ప్రేక్షకుడు చూడని అందమైన ప్రదేశాలు సినిమాకు మరింత అందాన్ని చేకూరుస్తాయని హను రాఘవపుడి చెప్పారు.

    భూకంపం, మెమరీ లాస్ అంశాలు

    భూకంపం, మెమరీ లాస్ అంశాలు

    పడి పడి లేచె మనసు సినిమాలో జాపకశక్తి కోల్పోవడం, భూకంపం అంశాలు కథకు బలంగా, ప్రాణంగా నిలుస్తాయని దర్శకుడు హను రాఘవపుడి వెల్లడించారు. మెమరీ లాస్, భూకంపం అంశాలు కథలో భాగాలుగా మాత్రమే ఉంటాయి. కథలో భావోద్వేగాలను ప్రేక్షకుడిని ఆకట్టుకొంటాయి అని చెప్పారు.

    జే కే అందించిన సినిమాటోగ్రఫి

    జే కే అందించిన సినిమాటోగ్రఫి

    పడి పడి లేచె మనసు సినిమాకు జే కే సినిమాటోగ్రఫి అదనపు ఆకర్షణగా మారిందని టాక్. అలాగే విశాల్ చంద్రశేఖర్ సంగీతం ఇప్పటికే ఆకట్టుకొన్నది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.

    సుధాకర్ చెరుకూరి నిర్మాతగా

    సుధాకర్ చెరుకూరి నిర్మాతగా

    శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై తెరకెక్కిన ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమని నిర్మాతలు భావిస్తున్నారు.

    English summary
    Padi Padi Leche Manasu has been unveiled a week prior to the film’s release and it is garnering enough attention already. The Hanu Raghavapudi directorial Padi Padi Leche Manasu stars Sharwanand and Sai Pallavi as the lead pair. It is all set for release on December 21.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X