twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'పడిపడి లేచే మనసు' క్లోజింగ్ కలెక్షన్స్.. నష్టం ఎంతంటే!

    |

    సాయి పల్లవి, శర్వానంద్ జంటగా నటించిన పడిపడి లేచే మనసు చిత్రం డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమ గాధ లాంటి హృదయాన్ని హత్తుకునే ప్రేమ కథలని ఈ దర్శకుడు రూపొందించారు. దీనితో శర్వానంద్, సాయి పల్లవి జంటగా రొమాంటిక్ లవ్ స్టోరీ రూపొందించడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ పడిపడి లేచే మనసు చిత్రం విడుదలయ్యాక ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. ఈ చిత్ర క్లోజింగ్ కలెక్షన్ల వివరాలు ఇప్పుడు చూద్దాం!

    ముగిసిన బిజినెస్

    ముగిసిన బిజినెస్

    సంక్రాంతి బరిలో భారీ చిత్రాలు నిలిచాయి. జనవరి 9న బాలయ్య నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంతో సంక్రాంతి చిత్రాల సందడి మొదలవుతుంది. సంక్రాంతి చిత్రాల తాకిడి సందర్భంగా ప్రస్తుతం ఉన్న చిత్రాల బిజినెస్ ముగియనుంది. పడిపడి లేచే మనసు చిత్ర బిజినెస్ దాదాపుగా అన్ని ఏరియాలలో ముగిసింది. పడిపడి లేచే మనసు చిత్రం ఫుల్ రన్ ముగిసే సమయానికి కేవలం 8 కోట్ల షేర్ మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది.

    2018 పోల్: ఈ హీరోలు, హీరోయిన్ల జాతకాలు మీ చేతుల్లోనే.. ఓట్ వేసి గెలిపించండి!2018 పోల్: ఈ హీరోలు, హీరోయిన్ల జాతకాలు మీ చేతుల్లోనే.. ఓట్ వేసి గెలిపించండి!

     నష్టం ఎంతంటే

    నష్టం ఎంతంటే

    పడిపడి లేచే మనసు చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ 22 కోట్ల వరకు జరిగింది. ఇందులో కేవలం 8 కోట్లు మాత్రమే రాబట్టడంతో డిస్ట్రిబ్యూటర్స్ కు అన్ని ఏరియాలలో 65 శాతం నష్టాలని మిగిల్చింది. ఈ చిత్రం 35 శాతం వసూళ్లు మాత్రమే రికవరీ చేయగలిగింది. కొన్ని ఏరియాలలో అయితే 30 శాతం కూడా రాబట్టలేదు. నైజాంలో ఈ చిత్రం 2.6 కోట్లు రాబట్టింది. ఈస్ట్ లో 43 లక్షలు, వెస్ట్ లో 31 లక్షలు రాబట్టిన ఈ చిత్రం ఉత్తరాంధ్రలో 80 లక్షలు వసూలు చేసింది.

    ఓవర్సీస్‌లో దారుణంగా

    ఓవర్సీస్‌లో దారుణంగా

    ఓవర్సీస్ లో ఈ చిత్ర వసూళ్లు మరీ నిరాశాజనకంగా ఉన్నాయి. ఫుల్ రన్ ముగిసే సమయానికి అమెరికాలో 315000 డాలర్లు మాత్రమే రాబట్టింది. అక్కడ రికవరీ చేయాల్సిన మొత్తం 900000 డాలర్లు. దీనితో యుఎస్ డిస్ట్రిబ్యూటర్ తీవ్రంగా నష్టపోయినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఈ చిత్రం 6 కోట్ల వరకు రాబట్టింది.

    నిర్మాతని ఆదుకునేలా

    నిర్మాతని ఆదుకునేలా

    పడిపడి లేచే మనసు చిత్రంతో నష్ట పోయిన నిర్మాతని ఆదుకునేందుకు సాయిపల్లవి మంచి నిర్ణయం తీసుకుంది. సాయి పల్లవి తన రెమ్యునరేషన్ లో దాదాపు 40 లక్షల వరకు వదులుకునట్లు తెలుస్తోంది. నిర్మాత సాయిపల్లవికి ఇంకా 40 లక్షలు ఇవ్వాలి. సినిమాకు నిరాశ పరచడంతో ఆ మొత్తాన్ని సాయి పల్లవి వదులుకుంది.

    English summary
    Padi Padi Leche Manasu Worldwide Closing Collections
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X