Breaking: Padma Awards 2022: భీమ్లా నాయక్ ఫేమ్ కిన్నెర మొగులయ్యకు పద్మశ్రీ.. తెలుగు రాష్ట్రాల్లో ఆరుగురికి..

దేశంలోని వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులు, వ్యక్తులకు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. రిపబ్లిక్ డే ఉత్సవాల సందర్భంగా ప్రతి ఏడాది ప్రకటించిన విధంగానే 2022లో 128 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. నలుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్ అవార్డులు, 107 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది.

తెలుగు రాష్ట్రాల్లో ఆరుగురికి పద్మ శ్రీ అవార్డులు ప్రకటించారు. ఏపీలో ముగ్గురికి, తెలంగాణలో ముగ్గురికి పద్మ శ్రీ అవార్డులు దక్కాయి. తెలంగాణలో దర్శనం మొగిలయ్య, పద్మజారెడ్డి, రామచంద్రయ్యకు పద్మశ్రీ అవార్డు దక్కాయి. ఏపీలో గరికపాటి నర్సింహారావు, సుంకర వెంకట ఆదినారాయణకు, గోసవీడు షేక్ హసన్‌కు పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు. ఇక గాయకుడు సోను నిగమ్, క్రీడాకారుడు, ఒలంపిక్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాకు అవార్డు లభించింది.

Padma Awards 2022: Bheemla Nayak fame Kinnera player Mogulaiah gets Padma Sri award

పద్మ విభూషణ్, పద్మభూషన్ అవార్డు లభించిన వారిలో స్వర్గీయ బిపిన్ రావత్, రాజకీయ నేత గులాం నబీ ఆజాద్, మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ కల్యాణ్ సింగ్‌కు, రాధేశ్యామ్ తదితరులు ఉన్నారు. కరోనావైరస్ వ్యాక్సిన్ తయారీ దారులు సైరస్ పూణేవాలా (సెరమ్ ఇన్స్‌టిట్యూట్), భారత్ బయోటెక్‌కు చెందిన కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్లాకు పద్మభూషణ్ అవార్డులు లభించాయి. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల, గూగుల్ ఇండియా సీఈవో సుందర్ పిచయ్‌కు పద్మభూషణ్ అవార్డులను ప్రకటించింది.

ఒడిశా రాష్ట్రంలో ఐదుగురు ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులు లభించాయి. పారా అథ్లేట్ ప్రమోద్ భగత్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగానికి చెందిన ఆదిత్య ప్రసాద్ దాష్, సాహిత్య రంగానికి చెందిన నరసింగ ప్రసాద్ గారు.. కళలు, ఇతర రంగానికి చెందిన శ్యామమణి దేవీ, సామాజిక సేవ రంగానికి చెందిన శ్రీమద్ బాబా బలియాకు పద్మశ్రీ అవార్డు లభించింది.

ప్రముఖ నటి షావుకారు జానకి తమిళనాడు రాష్ట్రం నుంచి పద్మశ్రీ అవార్డును ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమా రంగాల ప్రేక్షకులను ఆమె తన నటనతో ఆకట్టుకొన్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X