twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Padma Awards 2023: కీరవాణికి పద్మ అవార్డు.. మొత్తం 109 మందికి పురస్కారాలు.. తెలుగు వాళ్లు ఎవరంటే!

    |

    భారత ప్రభుత్వం ప్రకటించే అత్యుత్తమమైన అవార్డుల్లో పద్మ పురస్కారాలు ప్రత్యేకమైనవిగా చెప్పుకోవచ్చు. ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఈ అత్యున్నత పౌర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంటుంది. ఇక, ఈ ఏడాదికి గానూ తాజాగా పద్మ అవార్డులను ప్రకటించారు. ఇందులో ఈ ఏడాదికి గానూ మొత్తంగా 106 మందిని ఈ అవార్డులకు ఎంపిక చేశారు. అందులో 91 మందికి పద్మశ్రీ అవార్డును ప్రకటించగా.. ఆరుగురికి పద్మ విభూషణ్, తొమ్మిది మందికి పద్మ భూషణ్ అవార్డులు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

    కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఏకంగా 11 మంది తెలుగు వాళ్లు కూడా ఉన్నారు. అందులో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ఎమ్ కీరవాణి కూడా ఉన్నారు. ఆయనకు పద్మశ్రీ అవార్డు వరించింది. ఈ సంవత్సరానికి గానూ ప్రకటించిన 106 అవార్డుల్లో తెలుగు సినీ రంగం నుంచి ఈయన మాత్రమే చోటు దక్కించుకోవడం విశేషం.

    కీరవాణి మరో ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకోవడంతో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతోన్నాయి. ఈ అత్యున్నత పురస్కారాలను రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందజేయనున్నారు.

    Padma Awards 2023: M. M. Keeravani has been awarded with Padma Shri Award

    ఇదిలా ఉండగా.. ఆస్కార్ తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో RRR (రౌద్రం రణం రుధిరం) మూవీలో ఎమ్ఎమ్ కీరవాణి కంపోజ్ చేసిన నాటు నాటు సాంగ్‌ బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా ఎంపికైన విషయం తెలిసిందే.

    ఈ అవార్డును అందుకున్న చాలా తక్కువ సమయంలోనే కీరవాణి కంపోజ్ చేసిన ఈ పాట 2023 ఆస్కార్ అవార్డుల్లో భాగంగా తాజాగా అకాడమీ ప్రకటించిన నామినేషన్స్‌లో కూడా చోటు దక్కించుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో మరో నాలుగు పాటలతో పాటు ఇది కూడా పోటీ పడుతుంది. దీంతో కీరవాణి పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడాయన పద్మశ్రీ అవార్డుకు ఎంపిక కావడం ఆయన అభిమానులకు మరింత ఆనందాన్ని ఇస్తోంది.

    English summary
    Central Govt The prestigious Padma Awards are announced. Tollywood Top Music Director M. M. Keeravani has been awarded with Padma Shri Award
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X