Padma Bhushan: బాలకృష్ణకు పద్మభూషణ్.. జూ. ఎన్టీఆర్, రవితేజతోపాటు ఎవరెవరూ ఏమని ట్వీట్ చేశారంటే?

దేశంలో వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. రాష్ట్రపతి సుమారుగా 139 అవార్డుల కోసం ప్రముఖులను ఎంపిక చేసింది. వారిలో 7 గురిని పద్మ విభూషణ్, 19 మంది పద్మ భూషణ్, 113 మందిని పద్మ శ్రీ అవార్డుల కోసం ఎంపిక చేశారు. ఈ సంవత్సరం ఎంపిక చేసిన వారిలో 23 మంది మహిళలు ఉన్నారు.

అయితే తెలుగు సినిమా పరిశ్రమ నుంచి నందమూరి బాలకృష్ణ పద్మ భూషణ్ అవార్డును అందుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు అభినందనలు తెలిజేస్తున్నారు. బాలయ్య బాబు అంటూ అభినందించిన వారిలో..

Padma Bhushan for Nandamuri Balakrishna

ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ అవార్డుకు ఎంపికైన బాల బాబాయ్‌కి హృదయపూర్వక అభినందనలు. ప్రజాసేవకు, సినిమా రంగానికి మీరు చేసిన ఎనలేని సేవలకు గుర్తింపుగా దక్కిన గౌరవం అని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.


పద్మ భూషణ్ అవార్డుకు ఎంపికైన బాలయ్య బాబుకు కంగ్రాటులేషన్. సమాజానికి విశిష్ట సేవలతోపాటు సినిమా రంగానికి మీరు చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందుకోవడానికి నిజమైన అర్హత మీకు ఉంది అని మాస్ మహారాజ్ రవితేజ ట్వీట్ చేశారు.

అన్‌స్టాపబుల్ ఎవర్.. పద్మ భూషణ అవార్డు అందుకొన్న నందమూరి బాలకృష్ణకు హృదయపూర్వక అభినందనలు. కళా రంగానికి విశేష సేవలు అందించిన ఆయనకు ఈ అవార్డు దక్కడం ఆనందంగా ఉంది. ప్రతి విషయంలోను ట్రూ ఐకాన్. డాకు మహారాజ్, ఎన్‌బీకేకు మరింత బలాన్ని అందించాలని భగవంతుడిని కోరుకొంటున్నాను అని నిర్మాత నాగవంశీ అన్నారు.

చారిత్రాత్మక, గర్వంగా నిలిచిపోయే సమయం ఇది. పద్మ భూషణ్ అవార్డు అందుకోబోతున్న నందమూరి బాలకృష్ణకు కంగ్రాట్యులేషన్. రాబోయే తరాలకు మీ జర్నీ మరింత స్పూర్తిని అందిస్తుంది. మీకు దక్కిన గౌరవాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి గర్వపడుతున్నాం అని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చేసింది.


దర్శకుడు గోపిచంద్ మలినేని వినూత్న రూపంలో నందమూరి బాలకృష్ణకు అభినందనలు తెలిపారు. తాను దర్శకత్వం వహించిన వీర సింహారెడ్డి చిత్రంలోని సీన్‌ను షేర్ చేసి.. జై బాలయ్య.. పద్మభూషణ్ అంటూ ట్వీట్ చేశారు.

తెలుగు సినిమా రంగం గర్వపడే మూమెంట్. లివింగ్ లెజెండ్ నటసింహం నందమూరి బాలకృష్ణ గారు పద్మ భూషణ్ అవార్డుకు ఎంపికైన సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు. ఈ ఆనంద క్షణాలు తెలుగు ప్రజలందరికి గర్వంగా నిలుస్తాయి. సమాజానికి, కళలకు, సినిమా రంగానికి ఆయన చేసిన సేవలు విశిష్టమైనవి అని అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు.

అన్‌స్టాపబుల్ యాక్టర్, లీడర్, సమాజ సేవకుడు నందమూరి బాలకృష్ణ గారు పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన సందర్భంగా ఆయనకు మా హృదయపూర్వక అభినందనలు. దేశంలోనే మూడో అత్యున్నత పౌర పురస్కారం అందుకోవడం గర్వంగా ఉంది. తెలుగు సినిమా రంగానికి, అశేషమైన అభిమాన లోకానికి నిజమైన అన్ స్టాపబుల్ మూమెంట్స్ అని గీతా ఆర్ట్స్ ట్వీట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X