అక్కినేని నాగేశ్వరరావు ట్విట్టర్ డిటేల్స్ ...ట్వీట్స్
పద్మ భూషణ్ అక్కినేని నాగేశ్వరరావు తాజాగా ట్విట్టర్ లో ఎక్కౌంట్ తెరిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ 86 సంవత్సరాల నవ యువ హీరో మొదటగా ట్వీట్ చేస్తూ...నటీ నటులందరికీ, నన్ను ఇన్ని సంవత్సరాలుగా నిస్వార్ధంగా అభిమానిస్తున్న ప్రేక్షక లోకానికి నా మనపూర్వక కృతజ్ఞతలు అన్నారు. ఆయన తన అరవై రెండవ మ్యారేజ్ ఏనవర్శిరీ సంవద్భంగా ఈ ఎక్కౌంట్ ని ఓపెన్ చేసారు.ఆయన్ని ట్విట్టర్ లో పలకరించాలంటే.. http://twitter.com/A_NageswaraRao# లో దొరుకుతారు. ఇక ఆయన ట్వీట్స్ తో తన కుమారుడు నాగార్జునకి, మనమలు నాగచైతన్య, అఖిల్, సుమంత్ లకు పోటీ ఇస్తారమో చూడాలి. ఎంతో వాక్చుతుర్యం కలిగిన నాగేశ్వరరావు ట్విట్టర్ లోనూ అదరకొట్టాలని కోరుకుందాం.
అక్కినేని నాగేశ్వరరావు ట్విట్టర్ నాగార్జున నాగచైతన్య అఖిల్ akkineni nageswara rao twitter nagarjuna naga chaitanya akhil akkineni


Click it and Unblock the Notifications