twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇళయరాజాకు పద్మ విభూషణ్: మ్యూజిక్ లెజెండ్‌కు మరో గౌరవ పురస్కారం

    By Bojja Kumar
    |

    Recommended Video

    Padma awards 2018 : పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ గ్రహీతలు !

    వివిధ రంగాల్లో విశేష సేవలందించిన పలువురు ప్రముఖులకు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. వీరిలో సినీ రంగం నుండి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు పద్మవిభూషణ్‌ దక్కింది. ఇళయరాజాకు 2010లో పద్మభూషణ్ పురస్కారం అందించిన విషయం తెలిసిందే.

    రాయినైనా కరిగించగల శక్తి ఆయన సంగీతానికి ఉంది

    రాయినైనా కరిగించగల శక్తి ఆయన సంగీతానికి ఉంది

    రాయినైనా కరిగించగల శక్తి ఆయన సంగీతానికి ఉంది. ఎంతటి దు:ఖంలో ఉన్నా ఆయన స్వరాలు మనసును తాకితే ఇక ఆ ఆనందానికి అవధులు ఉండవు. ఎంతో వినసొంపైన స్వరాలను ఏరి కూర్చి పాటల మాలను కట్టే మ్యూజిక్ మ్యాస్ట్రో సొంతం.

    ఇళయరాజా

    ఇళయరాజా

    1943వ సంవత్సరం జూన్ 2వ తేదీన తమిళనాడులో జన్మించిన ఇళయరాజ ఒక నిరు పేదకుటుంబంలో జన్మించారు. కటిక పేదరికాన్ని అనుభవించిన ఆయన ఎంతో కష్టపడి భారతీయ సంగీత రంగంలో మ్యూజిక్ లెజెండ్‌గా ఎదిగారు.

    తొలి సినిమా

    తొలి సినిమా

    1976లో వచ్చిన ‘అన్నకిలి' అనే తమిళ చిత్రానికి ఇళయరాజా తొలిసారి సంగీతం అందించారు. జయప్రద నటించిన 'భద్రకాళి అనే చిత్రంలోని 'చిన్ని చిన్ని కన్నయ్య" అనే పాటకు సంగీతాన్ని అందించి తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో 'భద్రకాళి'కి తొలిసారి సంగీత దర్శకత్వం వహించినా, ఎన్టీఆర్‌ నటించిన 'యుగంధర్‌' మొదట విడుదలయింది.

    నిత్య సంగీత సాధకుడు

    నిత్య సంగీత సాధకుడు

    నిత్య సంగీత సాధకుడుగా ఇళయరాజాకు పేరుంది. మన సంగీతానికి పాశ్చాత్య సంగీతం కూడా మేళవిస్తూ చక్కని బాణీలు కూర్చడం ఆయన స్టైల్. దాదాపు 3 దశాబ్దాల పాటు దక్షిణ భారత సినీ
    పరిశ్రమను ఏలిన సంగీత నటరాజు ఇళయరాజ.

    అనేక అవార్డులు

    అనేక అవార్డులు

    ఇళయరాజ మూడు సార్లు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకోవడమేకాక, 2004లో ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. సినీ సంగీతానికి చేసిన కృషికిగాను గతంలో ఆయన 2012లో సంగీత నాటక అకాడమీ పురస్కారం, 2014 లో శ్రీ చంద్రసేకరేంద్ర సరస్వతి నేషనల్ ఏమినేన్సు పురస్కారం, 2015 లో గోవాలో జరిగిన 46వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియాలో జీవితకాల సాఫల్య పురస్కారం కూడా అందుకున్నారు.

    English summary
    Musician Ilayaraja honored with Padma Vibhushan award. Ilaiyaraaja is an Indian film composer who works predominantly in the South Indian cinema since the late 1970s. Regarded as one of the finest music composers in India, Ilaiyaraaja is also an instrumentalist, conductor, singer, and a songwriter.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X